విస్తారంగా వర్షాలు.. కరెంట్ తో జాగ్రత్త అంటున్న అధికారులు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి సూచించారు. ఈ మేరకు మంగళవారం సమీక్ష నిర్వహించారు. టీఎస్ ఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో చీఫ్ జనరల్ మేనేజర్, సూపరింటెండెంట్ ఇంజనీర్లతో ఆడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ సరఫరా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్తు వినియోగించే సమయంలో ప్రజలు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని రఘుమారెడ్డి కోరారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు పలు సూచనలు చేశారు.
వీలైనంత తొందరగా నా ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేయాలి..
అసెంబ్లీ కార్యదర్శినీ కలిసిన డీకే అరుణ… ఎన్నికల సంఘం జారీ చేసిన కాపీనీ అసెంబ్లీ కార్యదర్శికి అందజేసి వెంటనే అమలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ.. గద్వాల అసెంబ్లీ ఎన్నిక గెలిచిన అభ్యర్థి అఫిడవిట్ పైన పిటిషన్ వేశానని, గద్వాల ఎమ్యెల్యేని అనర్హుడిగా ప్రకటిస్తూ నన్ను ఎమ్యెల్యేగా హై కోర్టు తీర్పుఇచ్చిందని ఆమె వివరించారు. నిన్న కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిందని, తెలంగాణ గెజిట్ నోటిఫికేషన్ లో వెంటనే నా పేరును పబ్లిష్ చేయాలని చెప్పిందన్నారు. అసెంబ్లీ స్పీకర్, సెక్రెటరీకి రిప్రజెంటేషన్ ఇచ్చామని, స్పీకర్ అందుబాటులో లేరు వారి ఆఫీస్ లో లెటర్ ఇచ్చానన్నారు. స్పీకర్ అందుబాటులో లేరు.. కాల్ లో అవైలబుల్ గా లేరని, కేంద్ర ఎన్నికల సంఘం.. సీఎస్, అసెంబ్లీ సెక్రెటరీ కు ఆదేశాలు ఇచ్చారన్నారు.
కోర్టుకు గైర్హాజరుపై శశికళపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు వికె శశికళ “విఐపి ట్రీట్‌మెంట్” ఇచ్చిన ఆరోపణలపై విచారణకు హాజరుకాకపోవడంతో లోకాయుక్త ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2017లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలిన శశికళ.. పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్నారు. మరో నిందితురాలు శశికళ కోడలు ఇళవరసికి కూడా కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. వీరితో పాటు మరో ఇద్దరు వ్యక్తులకు కూడా నోటీసులు జారీ చేసిన కోర్టు.. సోమవారం విచారణను అక్టోబర్ 5కి వాయిదా వేసింది.
వరల్డ్ కప్ కు ఇదే ఫైనల్ టీమ్.. మార్పుల్లేవ్..
భారత్ వేదికగా జరుగనున్న వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ కి బీసీసీఐ ( భారత క్రికెట్ నియంత్రణ మండలి ) జట్టును ప్రకటించింది. టీమిండియా సారథి రోహిత్ శర్మతో కలిసి బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఐసీసీ ఈవెంట్ ఆడే 15 మంది సభ్యుల పేర్లను వెల్లడించాడు. టీమిండియా చీఫ్ సెలక్టర్ అగార్కర్ ముందు చెప్పినట్లుగానే ఆసియా వన్డే కప్ ఆడుతున్న జట్టు నుంచే వరల్డ్‌కప్ టీమ్‌ను ఎంపిక చేశారు. అందరు ఊహించినట్లుగానే యంగ్ ప్లేయర్స్ పేసర్ ప్రసిద్ కృష్ణ, హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మతో పాటు సంజూ శాంసన్‌కు మొండిచేయి ఎదురైంది. ఇక యజువేంద్ర చహల్‌కు కూడా ఈ వరల్డ్ కప్ ఈవెంట్‌లో పాల్గొనే ఛాన్స్ రాలేదు. కాగా, ఈ ప్రొవిజినల్ జట్టే ఫైనల్ అని, కేవలం గాయాల బెడద ఉంటే తప్ప ఈ జట్టులో ఎలాంటి మార్పులు, చేర్పులు ఉండవని టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తేల్చి చెప్పారు. అన్ని కోణాల్లో ఆలోచించిన తర్వాతే ఈ 15 మందిని వరల్డ్ కు ఎంపిక చేసినట్లు క్లారిటి ఇచ్చాడు. కాగా అక్టోబరు 5 నుంచి భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ టోర్నమెంట్ ఆరంభం కానుంది.
కొత్త కోడలికి అదిరిపోయే కానుక.. గోదారోల్లా మజాకా..!
గోదావరి జిల్లాలు మర్యాదలకు, సాంప్రదాయాలకు పెట్టింది పేరు.. కొత్త వాళ్లు గోదావరి జిల్లాలకు వెళితే చాలు మర్యాదలతో చంపేస్తారు.. బంధువులు అంటే అంత పిచ్చి.. ఎవరికి ఉన్నంతలోనే వారు అయినవాళ్లకు కడుపు నింపుతారు.. ఇటీవల సంక్రాంతికి కొత్త అల్లుడ్లకు రకరకాల వెరైటీలతో భోజనాలను వడ్డీంచిన సంగతి మరువక ముందే ఇప్పుడు మరొకటి వెలుగు చూసింది.. కాబోయే కొత్త కోడలికి అదిరిపోయే కానుకను ఇచ్చారు.. ఆ కానుకలో మర్యాద తగ్గకుండా 108 రకాల స్వీట్స్ ను ఇచ్చారు.. ఏంటో ఈ గోదారోళ్లు బాబోయ్..
వివరాల్లోకి వెళితే.. రాజమండ్రిలో జరిగిన ఓ నిచ్చాయతంభుల కార్యక్రమం లో పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు తరపున పెట్టిన స్వీట్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. పది కాదు ఇరవై కాదు ఏకంగా 108 రకాల స్వీట్స్ పెళ్ళికూతు తరుపున వారికి పెట్టీన స్వీట్స్ చర్చనీయాంశంగా మారింది. రాజమండ్రి మజిరా హోటల్ లో జరిగిన మున్నం, ప్రగడ కుటుంబాల ఎంగేజ్మెంట్ లో ఈ స్వీట్స్ దర్శనం ఇచ్చాయి..
సూపర్ ఆఫర్.. బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ తో టీవీ ఫ్రీ
ప్రస్తుతం చాలా టెలికాం కంపెనీలు హైస్పీడ్ ఇంటర్నెట్ బ్రాడ్ బ్యాండ్ సేవలతో పాటు అన్ లిమిటెడ్ డేటా అలాగే పలు ఓటీటీ ఛానెల్స్ కు యాక్సెస్ ను అందిస్తున్నాయి. అయితే ఇవన్నీ ఇచ్చే ఆఫర్స్ కు మించి ఒక అడుగు ముందుకేసింది ‘ఎక్సైటెల్’. బ్రాడ్ బ్యాండ్ సేవలతో పాటు ఉచిత టీవీ లేదా ఆండ్రాయిడ్ ప్రొజెక్టర్ ను అందిస్తుంది. బిగ్ స్క్రీన్ ప్లాన్స్ పేరుతో రెండు రకాల ప్లాన్లను ప్రకటించింది ఎక్సైటెల్. రూ.1,299 ప్లాన్ లేదా రూ.1,499 తీసుకునే వారు వీటిని పొందటానికి అర్హులు. అయితే ఇలాంటి ఆఫర్ ను ఎక్సైటెల్ ఈ ఏడాది ఏప్రిల్ లో ప్రయోగత్మకంగా చేసింది. అది మంచి ఫలితాన్ని ఇవ్వడంతో దేశ వ్యాప్తంగా 35 నగరాల్లో ఈ ఆఫర్ ను తీసువస్తుంది. ఈ రెండు ప్లాన్లను నో కాస్ట్ ఈఎంఐ తో అందిస్తుంది సంస్థ. ఈ విషయంపై కంపెనీ సీఓఓ వరుణ్ పస్రిచా మాట్లాడుతూ ఈ ఏడాది ఏప్రిల్ లో స్మార్ట్ టీవీ ఆఫర్ అందించినట్లు తెలిపారు. అది విజయవంతం కావడంతో ఇప్పుడు చాలా ప్రాంతాల్లో ఈ ఆఫర్ తీసుకువస్తున్నట్లు చెప్పారు. ఒకసారి చేస్తే అది ఎక్స్ ఫెరిమెంట్ అని, రెండో సారి చేస్తే అది కమిట్మెంట్ అని, ఎప్పుడూ చేస్తే అతి రెస్పా్న్స్ బిలిటి అని ఈ ఆఫర్ అందించడం కంపెనీ తన బాధ్యత భావిస్తుందని తెలిపారు.
ప్రభుత్వం వేరు ఉద్యోగులు వేరు కాదు..
టీచర్స్ డే సందర్భంగా విశాఖపట్నంలో ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకల్లో మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
ఉపాధ్యాయులు మా కుటుంబ సభ్యులు అని అన్నారు. ప్రభుత్వం వేరు ఉద్యోగులు వేరు కదనేది సీఎం జగన్ ఆలోచన.. ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వకుండా ఏ ప్రభుత్వం అయినా ఉంటుందా?.. అని ఆయన ప్రశ్నించారు. 8వ తేదీ నాటికి టీచర్ల ఖాతాలో జీతాలు పడతాయి.. ఈ సారి సాంకేతిక కారణాలతో జరిగిన అలస్యం వల్లే ఈ దుష్ప్రచారం జరుగుతోంది అని మంత్రి బొత్స అన్నారు. విద్యా వ్యవస్థలో పాఠశాలల నుంచి సంస్కరణలు అమలు చేస్తున్న రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ ఒక్కటే అని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఉపాధ్యాయులపై పని ఒత్తిడి పెరగకుండా చూస్తున్నాం.. విద్యార్థులతో పాటు 20 వేల మంది ఉపాధ్యాయులకు ట్యాబ్ లు ఇచ్చాము అని ఆయన పేర్కొన్నారు. విద్య మీద ఖర్చు సంక్షేమం కాదు.. ఈ రాష్ట్ర అభివృద్ధికి పెడుతున్న పెట్టుబడి అని మంత్రి చెప్పు కొచ్చారు. యూనివర్సిటీలో నియామకాలను దిసెంబర్ చివరి నాటికి పూర్తి చేస్తామని బొత్స సత్యనారాయణ వెల్లడించారు.
ఇండియా పేరు మార్చాల్సిన అవసరం ఏముంది..!
రాష్ట్రపతి భవన్‌లో జరగనున్న జీ-20 సదస్సు విందుకు భారత రాష్ట్రపతి పేరిట పంపిన ఆహ్వానంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. కేంద్ర ప్రభుత్వం దేశం పేరు మారుస్తోందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం ఆరోపించారు. ప్రపంచానికి ‘ఇండియా’ అనే పేరు తెలుసని.. అకస్మాత్తుగా కేంద్ర ప్రభుత్వం దేశం పేరు మార్చాల్సే అవసరం ఏమొచ్చిందని అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ కూడా బీజేపీ నేతృత్వంలోని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశం పేరును మారుస్తోందని ఆరోపించారు.
బీజేపీ ఇలాంటి కుంచిత తత్వాన్ని మానుకోవాలి
సింగరేణి వేతన బకాయిలు 23 నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఇవాళ ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కోల్ ఇండియా ఇప్పటికే ఐదుకు సంబంధించిన జీవో కూడా ఇచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. 2200 కోట్ల లాభంలో కార్మికుల వాటా 750 కోట్లు వారికీ రావాలని, రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిని తన ఇష్టం వచ్చినట్టు వాడుకోవాలని చూస్తుందని ఆయన మండిపడ్డారు. జెన్‌కో, ట్రాన్స్ కో నుంచి సింగరేణికి 20 వేల కోట్లు బకాయి ఉందని, తెలంగాణ ఏర్పడినపుడు 3540 బ్యాంకు బాండ్స్ తో లాభల్లో ఉండగా ఇప్పుడు బకాయిలు రాక కష్టాల్లో ఉందని ఆయన వెల్లడించారు. అప్పుడు 65 వేల కార్మికులు ఉంటే ఇప్పుడు 42 వేలకు పడిపోయిందని, కారణం బొగ్గు తవ్వే పని కాంట్రాక్టు ఇవ్వటంతో కార్మికులు సంఖ్య తగ్గిందని ఆయన అన్నారు.
కల్కికి తప్పని లీకుల బెడద.. ప్రభాస్ లుక్ లీక్
ఇండస్ట్రీలో లీకుల బెడద ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక స్టార్ హీరో సినిమా మొదలవ్వడం ఆలస్యం.. ఆ సినిమా ఫినిష్ అయ్యేవరకు ఏదో విధంగా ఆ సినిమాకు సంబంధించిన లీక్ నెట్టింట వైరల్ గా మారుతూనే ఉంటుంది. హీరో లుక్, సెట్ లో హీరోయిన్.. సాంగ్ బిట్.. ఇలా ఏదైనా కూడా లీక్.. లీకే. దీనివలన చూసేవారికి ఆనందం కలగవచ్చు కానీ, మేకర్స్ కు ఎంతో నష్టం వాటిల్లుతుంది. ఒక స్టార్ హీరో ఈ సినిమాలో ఎలాంటి లుక్ తో రాబోతున్నాడో అని అభిమానులు అతడి కోసం మొదటిరోజు.. మొదటి షోకు టికెట్ కొనుక్కొని వచ్చి.. వెండితెరపై ఆ లుక్ చుస్తే అతడు ఫీల్ అయ్యే ఆ ఫీల్ ను ఈ లీకులు పోగొడుతున్నాయి. ఈ లీకుల ద్వారా.. మొదటి నుంచే హీరో లుక్ బాలేదు.. సినిమాకు వెళ్లడం వేస్ట్ అనేలా అభిమానుల మనసులను ఈ లీకులు పాడుచేస్తున్నాయి. ఇక ఈ లీకులను ఆపడానికి మేకర్స్ ఎంతో పకడ్బందీగా ప్రయత్నాలు చేస్తున్నా.. యూనిట్ లో ఉన్నవారే అత్యుత్సాహంతో వాటిని బయటపెట్టి సినిమాను నష్టాలపాలు చేస్తున్నారు.
చంద్రబాబు నాయుడు స్కామ్ లకే స్కామర్
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కామ్ లకే స్కామ్ ల రాజని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ అన్నారు. కేంద్ర సంస్థలు ఈడీ, ఐటీ సమగ్ర దర్యాప్తు జరిపితే ప్రపంచమే నివ్వెరపోయే అవినీతి గుట్టలు అనేకం వెలుగు చూస్తాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్, రాజమండ్రి ఎంపీ భరత్ రామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో ఎంపీ భరత్ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అక్రమ సంపాదన రూ.118 కోట్ల విషయంపై ఐటీ శాఖ నోటీసులు ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు.
ఈ మహా తిమింగలానికి ఈ 118 కోట్లు అల్పాహారం వంటిదని ఎంపీ మార్గాని భరత్ వ్యాఖ్యానించారు. నోటీసులు అందుకున్నా కనీసం చంద్రబాబు నోరు మెదపడం లేదని.. చట్టాల్లోని లొసుగులను ఆధారం చేసుకుని తప్పించుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. హైకోర్టులో చంద్రబాబుపై 18 స్టేలు ఉన్నాయని, వాటిని తప్పించుకు తిరుగుతున్నారని అన్నారు. చంద్రయాన్-3ని చంద్రమండలం పైకి శాస్త్ర వేత్తలు ప్రయోగించి విజయం సాధించారే కానీ.. స్కామ్ ల బాబు స్కామ్ లను పట్టుకోవడం అధికార యంత్రాంగం వల్ల కావడం లేదని భరత్ ఆరోపించారు.
కష్టపడి కాదు.. ఇష్టపడి చదవండి.. ఫలితం మీ సొంతం
విద్య ద్వారానే ఉన్నతిని సాధించగలరని, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితమే ఇందుకు ఒక ఉదాహరణ అని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత అన్నారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా రాజమండ్రిలోని వేంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో గురు పూజోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి, జ్యోతి ప్రజ్వలన చేసిన హోంమంత్రి.. ఈ సందర్భంగా తానేటి వనిత మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరూ కష్టపడి కాకుండా ఇష్టపడి చదివినప్పుడే ఫలితం పొందుతారన్నారు. పిల్లలకు ఏ రంగంలో ఆసక్తి ఉంటే ఆ రంగంలో తల్లిదండ్రులు సరైన శిక్షణ ఇప్పిస్తే తప్పక రాణిస్తారని ఆమె అన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇచ్చారని హోం మంత్రి తెలిపారు.
పేరు మార్చే హక్కు ఎవరికీ లేదు.. కూటమి సమావేశంలో చర్చిస్తాం
జీ-20 విందులో రాష్ట్రపతిని ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ అని రాయకుండా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని రాయడంపై తీవ్ర దుమారం రేగుతుంది. ఈ నేపథ్యంలో ఈ విషయంపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పందించారు. దేశం పేరు మార్చే హక్కు ఎవరికీ లేదని ఆయన అన్నారు. మహారాష్ట్రలోని జల్‌గావ్ జిల్లాలో విలేకరుల సమావేశంలో ఎన్‌సీపీ చీఫ్ మాట్లాడుతూ.. రాజ్యాంగంలో భారతదేశం పేరు మార్చబడుతుందా? ఈ ప్రశ్నకు పవార్ స్పందిస్తూ.. ‘దీనిపై తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు. రేపు మల్లిఖార్జుర్ ఖర్గే అధ్యక్షతన జరగబోయే ఇండియా కూటమిలో.. అన్ని పార్టీల అధినేతలతో ఈ అంశంపై చర్చిస్తామని తెలిపారు. దేశం పేరు మార్పుపై అధికార పార్టీ ఎందుకు బాధపడుతుందో అర్థం కావడం లేదని శరద్ పవార్ పేర్కొన్నారు.
చంద్రబాబు జైలుకు వెళ్లటం ఖాయం..
చంద్రబాబు దొంగని రాష్ట్ర ప్రజలకు తెలుసు అని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ప్రతీసారీ తప్పించుకుని పోతున్నాడు.. ఏదో రకంగా కోర్టులను మేనేజ్ చేసుకుంటూ మనుగడ సాగించాడు.. ఇవాళ దొంగ దొరికాడు.. ముందు నుంచి మేము ఏదైతే చంద్రబాబు గురించి చెబుతున్నామో అదే నిజమని తేలింది.. చంద్రబాబు జైలుకు వెళ్లటం ఖాయం అని ఆయన పేర్కొన్నారు. పూర్తి ఆదారాలతోనే ఆయనకు ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చారు.. తనపై వచ్చిన ఆరోపణలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి అని మంత్రి డిమాండ్ చేశారు.
దొంగ ఓట్లను చేర్చి గెలవాలనే దిక్కుమాలిన ఆలోచన చంద్రబాబుదే..
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని వైసీపీ నేతలు కలిశారు. ఏపీలో ఎన్నికల ఓటర్ లిస్టులో డూప్లికేట్ ఓటర్లు ఇంకా ఉన్నారు అని ఈ సందర్భంగా మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఒకే పేరు.. ఒకే ఐడీ.. ఒకే ఫొటోతో వేర్వేరు చోట్ల ఓట్లు ఉన్నాయి.. దీన్ని సరి చేయాలని ఎన్నికల అధికారిని కోరామని ఆయన పేర్కొన్నారు. ఏపీ ఓటర్ లిస్టులో అక్రమాలు జరుగుతున్నాయని టీడీపీ గగ్గోలు పెడుతోంది.. వైసీపీ ప్రభుత్వం.. పార్టీ ఓటర్ల జాబితాలో అక్రమాలు పాల్పడుతోందని విమర్శలు చేస్తున్నారు.. బీజేపీ కూడా ఓటర్ల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయంటూ పదవి పోయిన ఓ నేత వచ్చి మాట్లాడుతున్నారు అని పేర్నినాని అన్నారు.