Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Khammam Khammam Bhoodan Land Issue House Pattas Distribution

Khammam : భూదాన్‌ భూముల వివాదంపై సర్కార్‌ కీలక నిర్ణయం.. బాధితులకు ఇళ్ల పట్టాలు..

Published Date :March 10, 2026 , 8:46 pm
By Gogikar Sai Krishna
  • వెలుగుమట్ల భూదాన్ భూముల వివాదానికి పరిష్కారం
  • బాధితులకు ఇళ్ల పట్టాల పంపిణీకి సర్కార్ నిర్ణయం
  • 310 కుటుంబాలకు టోకెన్లు.. ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం
  • ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పేదలకు కొత్త ఆశలు
Khammam : భూదాన్‌ భూముల వివాదంపై సర్కార్‌ కీలక నిర్ణయం.. బాధితులకు ఇళ్ల పట్టాలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల వివాదానికి శాశ్వత పరిష్కారం చూపుతూ తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. గత నెలలో జరిగిన కూల్చివేతల వల్ల రోడ్డున పడ్డ పేదలకు అండగా నిలుస్తూ, రేపు (బుధవారం) ఖమ్మం కలెక్టరేట్ వేదికగా బాధితులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుల సమక్షంలో ఈ కార్యక్రమం వైభవంగా జరగనుంది.

LPG Crisis: LPG కొరత వేళ, సిలిండర్ల లారీ దొంగతనం..

గత నెల 24న వెలుగుమట్ల భూదాన్ భూముల్లో అక్రమ నిర్మాణాల పేరుతో అధికారులు చేపట్టిన కూల్చివేతలు రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. సుమారు 15 ఏళ్ల క్రితమే తాము పట్టాలు పొందామని, తమ ఇళ్లను ఎలా కూల్చుతారని బాధితులు చేసిన పోరాటంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీనిపై లోతైన సర్వే నిర్వహించిన జిల్లా అధికారులు, ప్రాథమికంగా 310 మందిని అర్హులుగా గుర్తించి వారికి టోకెన్లు కూడా జారీ చేశారు. ప్రభుత్వం కేవలం ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడమే కాకుండా, బాధితులు తమ కలల సౌధాన్ని నిర్మించుకోవడానికి ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకం ద్వారా ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేయనుంది.

Jana Sena Party Membership: జనసేన సభ్యత్వ నమోదుపై పవన్‌ కల్యాణ్‌ కీలక నిర్ణయం..

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, పేదలకు అన్యాయం జరగనివ్వబోమని, ఇది ఇందిరమ్మ ప్రభుత్వమని స్పష్టం చేశారు. భూమి లేని నిరుపేదలకు ఇళ్లు కట్టుకోవడానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. వెలుగుమట్లలోని వివాదాస్పద భూమిని భవిష్యత్ అవసరాల కోసం లేదా ప్రజా ప్రయోజనార్థం ఉపయోగించాలని యోచిస్తున్న ప్రభుత్వం, బాధితులకు మాత్రం ఎక్కడా ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయంగా మెరుగైన స్థలాలను కేటాయించేలా చర్యలు చేపట్టింది. ఈ నిర్ణయంతో గత కొన్ని రోజులుగా ఆందోళనలో ఉన్న వందలాది కుటుంబాల్లో మళ్లీ వెలుగులు నిండనున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bhatti vikramarka
  • Bhoodan Lands Issue
  • Indiramma housing scheme
  • khammam news
  • Ponguleti Srinivas Reddy

తాజావార్తలు

  • Carmeni Selvam: ఆలోచింపచేసేలా ‘కార్మేని సెల్వం’ టీజర్

  • LPG Gas Saving Tips: ఈ చిట్కాలు పాటిస్తే.. సిలిండర్ ఎక్కువ రోజులు వస్తుంది..!

  • USA: “లొంగిపో లేదంటే చంపేస్తాం”.. కొత్త సుప్రీం లీడర్‌కు యూఎస్ వార్నింగ్..

  • Ustaad Bhagat Singh: ‘కాలరే ఎత్తరా’ అంటున్న ఉస్తాద్

  • North Korea: కుమార్తెకు గన్ ఫైర్ నేర్పిస్తున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్.. కారణం ఇదేనా..?

ట్రెండింగ్‌

  • టీ20 ప్రపంచకప్ విజయం ప్రేరణగా ‘Ola Champions Edition’ కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు.. ఫీచర్స్ ఇలా.!

  • LIC New Children Money Back Plan: రోజుకు రూ.150 పెట్టుబడి అంతే.. రూ.19 లక్షలు మీసొంతం.!

  • 120Hz LCD డిస్‌ప్లే, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో iQOO Z11x 5G లాంచ్.. ధర ఎంతంటే?

  • Ear Care Tips: మీ చెవుల ఆరోగ్యం మీ చేతుల్లోనే.. ఈ 4 తప్పులు అస్సలు చేయకండి.!

  • Summer Hacks : వేసవిలో వాటర్ ట్యాంకు నీరు వేడెక్కుతోందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో నీటిని చల్లగా ఉంచండి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions