Deputy CM Bhatti Vikramarka: ప్రపంచంలో పోటీపడే విధంగా మన బిడ్డలు ఎదగటం కోసమే యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రతి స్కూలుకి 200 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. ఖమ్మంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 20 ఎకరాల ప్లాన్‌లో అత్యంత అద్భుతంగా స్కూళ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. ఇంటర్నేషనల్ స్కూల్స్ స్థాయిలో నిర్మాణం జరుగుతుందని వెల్లడించారు. దేశంలోనే ఇటువంటి స్కూల్స్ ఏ రాష్ట్రంలో కూడా…
Samineni Ramarao murder: మధిర శాసనసభ నియోజకవర్గం చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో శుక్రవారం ఉదయం సీనియర్ నేత సామినేని రామారావు రాజకీయ హత్యకు గురికావడంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దోషులను వెంటాడి, వేటాడి చట్టపరంగా శిక్షిస్తామని హెచ్చరించారు. కలుషిత హింస రాజకీయాలకు తావు లేదు అని డిప్యూటీ సీఎం అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణపై ఖమ్మం పోలీసు అధికారులను హెచ్చరించారు. క్లూస్ టీం, శ్రీ ఫర్ డాగ్స్, సైబర్ టీం, ఆధునిక…
ఖమ్మం జిల్లా, కొణిజర్ల మండలం అమ్మపాలెం గ్రామంలోని మైనారిటీ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. దసరా సెలవుల సందర్భంగా ఇంటికి వెళ్లిన ఒక విద్యార్థి, స్కూల్‌లో పనిచేస్తున్న జువాలజీ టీచర్ లైంగికంగా వేధిస్తున్నాడని తల్లిదండ్రులకు తెలిపాడు.
ఖమ్మం జిల్లా నడిబొట్టున దాదాపు 200 కోట్ల పైచిలుకు వివాదంలో చిలికి చిలికి గాలి వానగా మారుతుంది .ఈ వివాదంలో పోలీసులు ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వివాదం చల్లారటం లేదు.
ఖమ్మం నగరంలో రౌడీయిజం పెరిగిపోతుంది.గంజాయి మత్తులో విచక్షణ రహితంగా దాడులు జరుగుతున్నాయి. తాజాగా కార్పోరేషన్ పరిదిలోని గోపాల పురం వద్ద హైవే మీద కిరాణ దుకాణంమీద కొంత మంది దుండగులు పడి దౌర్జన్యం చేశారు.
రాబోయే ఐదు రోజుల్లోనే రైతులకు ధాన్యం కొనుగోలుకు 500 రూపాయల బోనస్ ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో ప్రజా పాలన ప్రగతి బాట కార్యక్రమంలో పాల్గొన్న రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 16 లక్షల మంది లబ్ధిదారులని పొందుపరిచామని వెల్లడించారు.
Ragging : ఖమ్మం జిల్లా పాల్వంచలోని కెఎల్ఆర్ ఫార్మసీ కాలేజీలో ర్యాగింగ్ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. కాలేజీలో ర్యాగింగ్ వేధింపులకు తాళలేక ఒక విద్యార్థిని కాలేజీని వదిలిపెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలు శ్రుతి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ)ను ఆశ్రయించి తన వేదనను తెలియజేశారు. శ్రుతి ఫిర్యాదులో కాలేజీ యాజమాన్యం తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను ఇవ్వకుండా వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. “మూడు లక్షల రూపాయలు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామని కాలేజీ యాజమాన్యం చెబుతోంది,” అని…
Cyber Fraud: ఓ సైబర్ నేరగాని పోలీసులు వెంటాడి వెంటాడి నేరాల పుట్టను రట్టు చేసిన సంఘటన కామపల్లిలో చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం అడవి మద్దులపల్లి కి చెందిన గడబోయిన హరీష్ గత కొంతకాలంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నాడు. ఫేక్ ఐడీలను సృష్టించి అనేక మంది వద్ద డబ్బులను తన ఎకౌంట్లో జమ చేసుకోవడం ప్రధాన ఉత్తిగా మారింది. హరీష్ ఇంటి వద్ద ఉంటూ టెంట్ హౌస్ తో పాటు మినరల్ వాటర్ ప్లాంట్…
Skeleton : ఖమ్మం జిల్లా కుక్కల గుట్టలో గుర్తు తెలియని మహిళ ఆస్తిపంజరం ఖమ్మం జిల్లాలో మరోసారి కలకలం రేపింది. గడిచిన ఐదేండ్లలో ఇదే కుక్కల గుట్టలో తనను ప్రేమించడం లేదని ఒక సైకో.. విద్యార్థినిని హత్య చేశాడు. ప్రియురాలి మోజులో పడి భార్యను హత్య చేశాడు భర్త. ఈ రెండు సంఘటనలు ఇదే ప్రాంతంలో అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అసలు కుక్కల గుట్టపై ఏం జరుగుతోంది? తాజాగా గుర్తు తెలియని మహిళ అస్థి…
Tummala Nageshwara Rao : ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ రాజకీయాలపై, ప్రజాస్వామ్య వ్యవస్థలపై, సమకాలీన పరిస్థితులపై తన గుండెతల్లిపడే భావాలను వ్యక్తపరిచారు. ‘‘రాజకీయాలు ఈ రోజుల్లో చాలా కలుషితమయ్యాయి. ప్రజాస్వామిక విలువలు మరిచిపోతున్నారు. వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి. అన్నింటినీ గాడిలో పెట్టే బాధ్యత ఇప్పటికీ మీడియాదే’’ అని తుమ్మల స్పష్టం చేశారు. వాటి పక్షపాతాలు, అర్థం లేని ప్రచారాలు తప్ప నిజాలను రాయాల్సిన బాధ్యత మీడియాపై ఉందని మంత్రి వ్యాఖ్యానించారు. ‘‘కొన్ని పార్టీలు తప్పుడు…