Indiramma Housing Scheme: పెద్దపల్లి జిల్లాలోని మంథని నియోజకవర్గ పరిధిలోని ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లిస్టులో తమ పేర్లు లేవని కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. మొదటి లిస్టులో తమ పేర్లు ఎంపిక చేసి తర్వాత లిస్టులో నుండి తమ పేర్లను తొలగించాలని ఆవేదన వ్యక్తం చేశారు. దీనితో ఎనిమిది మంది మహిళలు ట్యాంక్ ఎక్కి రెండు గంటల పాటు ఆందోళన బాట పట్టారు.…
Mulugu: ములుగు జిల్లా నేడు అధికారిక పర్యటనకు వేదిక కానుంది. రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క ములుగు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ రోజు ఉదయం 9:30 గంటలకు మంత్రులు బేగంపేట నుంచి హెలికాప్టర్ ద్వారా ములుగు జిల్లాకు ప్రయాణం ప్రారంభించనున్నారు. ఉదయం 10:20కి ములుగు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సమీపంలోని హెలిప్యాడ్ వద్దకు చేరుకోనున్నారు. అనంతరం ఉదయం 10:30 గంటలకు ములుగు మండలంలోని ఇంచర్ల గ్రామంలో ఇందిరమ్మ కాలనీకు శంకుస్థాపన…
దేశంలో ఎక్కడ లేని విధంగా 5 లక్షల రూపాయలతో ఇళ్లు శాంక్షన్ చేశాం.. నియోజకవర్గానికి 3500 ఇల్లు కేటాయించడం గొప్ప విషయం.. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి హౌసింగ్ మంత్రి కసరత్తు చేస్తున్నారు.. 4 లక్షల 56 వేల ఇళ్లకు నిర్మాణాలు చేపడుతున్నాం అని భట్టి విక్రమార్క తెలిపారు.
Indiramma Houses : తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల సొంతింటి కలను నిజం చేసేందుకు ఒక గొప్ప ముందడుగు వేస్తోంది. రాష్ట్రంలో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు తక్కువ ధరలకే సిమెంట్ , స్టీలు సరఫరా చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు, సంబంధిత ప్రభుత్వ అధికారులు సిమెంట్ , స్టీలు ఉత్పత్తి చేసే వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ధరల కంటే…
CM Revanth Reddy : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇళ్ల కలను సాకారం చేసే దిశగా మరో అడుగు వేసింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మొదటి విడతలో లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించే కార్యక్రమంలో భాగంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం 12 మంది లబ్ధిదారులకు లాంఛనంగా ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా రూ. 20.19 కోట్లను 2,019 మంది లబ్ధిదారులకు విడుదల చేశారు. పైలట్ ప్రాజెక్ట్ కింద…
Grama Sabalu : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26 నుండి అమలు చేయబోయే నాలుగు ముఖ్యమైన సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. గతంలో అందిన దరఖాస్తుల ఆధారంగా ఫీల్డ్ సర్వే బృందాలు లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి వారి వివరాలను సేకరించి, అర్హుల జాబితాను రూపొందించి సంబంధిత అధికారులకు అందించారు. ఈ జాబితాలను గ్రామ, వార్డు స్థాయి సభల్లో బహిరంగంగా చదవనున్నారు. జాబితాలో ఉన్న పేర్లపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే, ఆయా అభ్యంతరాలను స్వీకరించేందుకు…
Bhatti Vikramarka : నాగర్ కర్నూల్ జిల్లాలోని తిమ్మాజీపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ హాజర్యారు. సబ్ స్టేషన్ శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…
TG Cabinet : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జనవరి 4న సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో జరగనుంది. ఈ సమావేశంలో రైతు భరోసా, భూమిలేని పేదలకు నగదు సహాయం, కొత్త రేషన్ కార్డులు, , నూతన టూరిజం పాలసీపై చర్చించనున్నట్లు సమాచారం. సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో రైతు భరోసా కార్యక్రమంపై కీలక…
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి నేడు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూ భారతి, ఇందిరమ్మ ఇళ్లపై వివరాలను అధికారుల నుంచి తెలుసుకోనున్నారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కోసం ఇంటింటికి సర్వేలు చేపడుతున్న ప్రభుత్వం.. చాలా వరకు సర్వేను పూర్తి చేసింది. అయితే… సంక్రాంతి తర్వాత పేదలకు ఇందిరమ్మ ఇళ్లు పంపిణీ చేసే యోచనలో తెలంగాణ సర్కార్ ఉంది. ఈ క్రమంలోనే అధికారులతో ఇందిరమ్మ ఇళ్లపై సమీక్షించనున్నారు సీఎం…