KTR: డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కేయాలని చూస్తున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డీలిమిటేషన్ ( పునర్విభజన)పై దక్షిణాది రాష్ట్రాల ఆందోళనను కేంద్ర ప్రభుత్వం వినాలని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కోరారు. దక్షిణ భారతదేశంలో సీట్లు తగ్గితే బలమైన ప్రజా ఉద్యమం వస్తుందని ఆయన హెచ్చరించారు. దక్షిణాది రాష్ట్రాల ప్రజలంతా భారతీయులుగా, ఉత్తమ పనితీరు కనబరిచే రాష్ట్రాల వాసులుగా గర్వపడుతున్నారని ఆయన తెలిపారు. పార్లమెంట్ దేశ అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక, దక్షిణాది రాష్ట్రాల గొంతుని అణచివేయాలని చూస్తే మౌనం వహించేది లేదని మంత్రి కేటీఆర్ తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అన్ని విషయాలను వింటుందని, న్యాయం గెలుస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Read Also: Off The Record: తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందా? చేయదా?
Also Read
ఈ మేరకు ఓ జాతీయ పత్రిక ప్రచురించిన డీలిటేషన్‌కు సంబంధించిన స్టోరీని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ట్యాగ్ చేస్తు పోస్ట్ చేశారు. కథనంలో పేర్కొన్న గణాంకాలే నిజమైతే ప్రజా ఉద్యమం తప్పదని ఆయన స్పష్టం చేశారు. అయితే, దేశంలో ప్రస్తుత జనాభాను పరిగణలోకి తీసుకొని పార్లమెంట్ నియోజకవర్గాల పునర్వీభజన జరిపితే ఉత్తరాది రాష్ట్రాలకు లోక్‌సభలో ప్రాతినిథ్యం పెరుగనుండగా.. దక్షిణాది రాష్ట్రాల్లో భారీగా స్థానాలు కోల్పోనున్నాయి. తాజా అంచనాల ప్రకారం.. ఉత్తరాది రాష్ట్రాలకు అదనంగా 32 స్థానాలు కలిసి వస్తుండగా.. సౌత్ ఇండియాకు చెందిన ఆయా రాష్ట్రాలు 24 స్థానాలను కోల్పోయే ప్రమాదం ఉంది. ఇక, తమిళనాడులో ప్రస్తుతం 39 పార్లమెంట్ స్థానాలుండగా.. డీలిమిటేషన్ తర్వాత అవి 31కి తగ్గుతాయి. తెలంగాణ, ఏపీ, కేరళ నుంచి 8 స్థానాలు, కర్ణాటక రెండు స్థానాలు కోల్పోనుంది. అటు, మధ్యప్రదేశ్‌లో నాలుగు, రాజస్థాన్‌లో 6, బీహార్‌లో పది, ఉత్తరప్రదేశ్‌లో 11 స్థానాలు అదనంగా పెరిగే ఛాన్స్ ఉంది.
Read Also: Ruchira Kamboj: సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు భారత్ కట్టుబడి ఉంది..
జనాభా ప్రాతిపదికన.. దేశంలో, రాష్ట్రాల్లో చట్ట సభల నియోజకవర్గాల సంఖ్య, పరిధులను నిర్ణయించే ప్రక్రియనే డీలిమిటేషన్ అంటారు. ఈజీగా చెప్పాలంటే ఆయా రాష్ట్రాల్లోని జనాభాకు సరైన ప్రాతినిధ్యం లభించేలా పార్లమెంటులో, అసెంబ్లీల్లో సరైన సీట్లుండేలా చూసే ప్రక్రియనే డీలిమిటేషన్ అని అంటారు. అంటే మారుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు ఈ మార్పులు చేర్పులు చేసుకునేలా మన రాజ్యాంగం ఇచ్చిన వెసులుబాటు అన్నమాట.
This delimitation (if the numbers reported are right) will lead to a strong people’s movement in the entire Southern India
We are all proud Indians & representatives of the best performing states of India
We will not remain mute spectators if the voices and representation of… https://t.co/RJcRZT2BTk
— KTR (@KTRBRS) September 25, 2023
తాజావార్తలు
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!