Keerthi Suresh : స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీసెంటుగా తన బోయ్ ఫ్రెండ్ ఆంటోనిని పెళ్లి చేసుకుంది. ప్రేమ పెళ్లి గురించి నిన్న మొన్నటి దాకా చాలా సీక్రెట్ గా ఉన్న కీర్తి సురేష్.. పెళ్లి మరో రెండు వారాలు ఉంది అనగా మీడియాకు లీక్స్ ఇస్తూ ఓపెన్ అయింది. హీరోయిన్ గా ఇప్పటికే ఎంతోమంది అభిమానుల హృదయాలను దోచేసిన కీర్తి సురేష్ తన మనసు మాత్రం తన స్నేహితుడు ఆంటోనికి అప్పజెప్పింది. ఐతే వీరిద్దరి ప్రేమ అనుబంధం చాలా సీక్రెట్ గా కొనసాగింది.
Read Also:Introverts Day: ప్రతిదానికి మొహమాటపడిపోతున్నారా? వారిని ఏమంటారంటే..
కీర్తి సురేష్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన టైం లోనే పీకల్లోతు ప్రేమలో ఉంది. కానీ ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా దాచింది. ఇంటర్ లోనే ఆంటోనితో ప్రేమలో పడిందట కీర్తి సురేష్. 2010 లోనే అతను తనకు ప్రపోజ్ చేశాడని ఐతే 2016 నుంచి మా లవ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిందంటూ చెప్పుకొచ్చింది కీర్తి సురేష్. తను ఇచ్చిన ప్రామిస్ రింగ్ ని తీయకుండా అలానే ఉంచుకున్నానని… మా పెళ్లి ఒక కల అని.. అది ఇంత ఘనంగా జరిగినందుకు సంతోషంగా ఉందని కీర్తి తెలిపింది.
Read Also:Rewind 2024 : ఓవర్సీస్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన 2024 టాలీవుడ్ సినిమాలు
ఐతే కీర్తి సురేష్ 15 ఏళ్ల ప్రేమ గురించి తెలిసిన ఆడియన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇన్నాళ్లు తెర మీద ప్రతి సినిమాలో హీరోలను ప్రేమిస్తూ వచ్చిన అమ్మడు రియల్ లైఫ్ లో తన మనసును నచ్చినోడికి 15 ఏళ్ల క్రితమే ఇచ్చేసిందా ఎంత మోసమా అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. కీర్తి సురేష్ అభిమానులు మా హీరోయిన్ హ్యాపీ.. మేము కూడా హ్యాపీ అంటున్నారు. ఐతే భర్త గురించి చెబుతూ ఆంటోని ఖతార్ లో బిజినెస్ చేస్తున్నాడని.. తన కెరీర్ లోఎంతో సపోర్ట్ గా నిలుస్తూ వచ్చాడని చెప్పుకొచ్చింది. అంతేకాదు తను చాలా మొహమాటస్తుడు అందుకే ఫోటోలకు సరిగా స్టిల్స్ కూడా ఇవ్వలేదని అంటుంది కీర్తి సురేష్.