Rewind 2024 : ఓవర్సీస్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన 2024 టాలీవుడ్ సినిమాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ సినిమాలు ప్యాన్ ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్ లో కూడా సత్తా చాటుతున్నాయి. ముఖ్యంగా మన తెలుగు సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి కలెక్షన్స్ రాబడుతున్నాయో ఓవర్సీస్ లో కూడా అంతే స్థాయిలో ఒక్కోసారి అంతకు మించి ఎక్కువ కలెక్షన్స్ రాబడుతున్నాయి. 2024 లో ఓవర్సీస్ లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్ చూస్తే
1) కల్కి2898AD : రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్స్ రాబట్టింది. వరల్డ్ వైడ్ గా రూ. 1200 కోట్లు రాబట్టిన ఈ సినిమా ఓవర్సీస్ లో రూ. 275 కోట్లు రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది.
Also Read
- IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
- Abhijit Dipke: "రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి".. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
- CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
2) పుష్ప – 2 : ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ , సుకుమార్ కాంబోలో వచ్చిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వేట ఇంకా కొనసాగుతూనే ఉంది. హిందీలో రూ. 800 కోట్లు రాబట్టిన ఈ సినిమా కేవలం 25 రోజుల్లో రూ. 264 కోట్లు కలెక్ట్ చేసి ఇంకా సూపర్ స్ట్రాంగ్ గా కొనసాగుతుంది.
3) దేవర – యంగ్ టైగర్ ఎన్టీఆర్ దాదాపు 6 ఏళ్ల సోలో రిలీజ్ తర్వాత వచ్చిన చిత్రం దేవర. వరల్డ్ వైడ్ గా రూ. 800 కోట్లు కొల్లగొట్టిన ఈ చిత్రం ఓవర్సీస్ లో రూ. 75 కోట్లు రాబట్టింది.
4 ) హనుమాన్ – యంగ్ హీరో తేజ సజ్జా బిగ్గిస్ట్ హిట్ హనుమాన్ ఓవర్సీస్ లో రూ. 57. 3 కోట్లు వసూలు చేసి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్య పరిచింది.
5 ) టిల్లు స్క్వేర్ -DJ టిల్లు కు కొనసాగింపుగా వచ్చిన ఈ సినిమా తెలుగు స్టేట్స్ తో పోటీపడుతూ ఓవర్సీస్ మార్కెట్ లో రూ. 30 కోట్లకు కలెక్ట్ చేసింది
6) గుంటూరు కారం – సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో వచ్చిన ఈ సినిమా మిశ్రమ స్పందన రాబట్టిన ఓవర్సీస్ మార్కెట్ లో రూ. 29 కోట్లు కొల్లగొట్టింది.
7 ) సరిపోదా శనివారం – నేచురల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారం టాలీవుడ్ లో సూపర్ హిట్ కాగా ఓవర్సీస్ లో రూ. 27. 4 కోట్లు సంపాదించి సూపర్ హిట్ గా నిలిచింది.
8) లక్కీ భాస్కర్ – దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన ఈ సినిమా ఓవర్సీస్ లో అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది. ఫైనల్ రన్ లో ఓవరీస్ నుండి రూ. 27.5 కోట్లు కొల్లగొట్టాడు లక్కీ భాస్కర్
NOTE : ఈ వివరాలు మేము వివిధ మార్గాల ద్వారా కలెక్ట్ చేసి అందిస్తున్నాము. వీటికి మాకు ఏ విధమైన సంబంధం లేదు. గమనించగలరు.
తాజావార్తలు
-
IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
-
Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
-
Abhijit Dipke: “రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి”.. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!