తెలంగాణలో పాలిటిక్స్ హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. అయితే భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హాట్ కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాంగ్రెస్, బీజేపీ పార్టీలలో కోవర్టులు ఉన్నారు అని ఆయన వ్యాఖ్యనించారు. ఈటల రాజేందర్ అనేటోడు పార్టీ మారడు.. అంగీ మార్చుకున్నంత ఈజీ కాదు పార్టీ మారడం అంటే అంటూ కామెంట్స్ చేశారు. హైదరాబాద్ లో వర్షాలు వస్తే గవర్నర్ ఇంటి ముందే పడవలు వేసుకుని తిరిగే పరిస్థితి నెలకొంది.. కరీంనగర్ ని లండన్, హైదరాబాద్ ని డల్లాస్ చేస్తానని కేసీఆర్ అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తున్నారు అని ఈటల రాజేందర్ అన్నారు.
Read Also: Puri: ‘డబుల్ ఇస్మార్ట్’ రెడీ… పూరి టైం స్టార్ట్!
మరోవైపు తెలంగాణ బీజేపీలో నేతల మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. ఇక, నిన్న(గురువారం) బీజేపీ నేత జితేందర్ రెడ్డి తెలంగాణ బీజేపీ నేతలను ఉద్దేశించి చేసిన ట్వీట్ సంచలనం రేపుతుంది. ఈ నేపథ్యంలో జితేందర్ రెడ్డి ట్వీట్‌పై హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. జితేందర్ రెడ్డి అలా ఎందుకు ట్వీట్ చేశారో ఆయననే అడగాలి.. వయసు, అనుభవం ఉన్నవారు జాగ్రత్తగా మాట్లాడాలి అని అన్నారు. ఎవరి గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవాలి.. ఇతరుల స్వేచ్చ, గౌరవం తగ్గించకూడదు అంటూ హాట్ కామెంట్స్ చేశారు.
Read Also: International Driving Licence : అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ ఎలా పొందాలి?
అయితే, ఈటల రాజేందర్ చేసిన ఈ కామెంట్స్ తెలంగాణ బీజేపీలో మరోసారి కాకరేపుతున్నాయి. గతకొంత కాలంపై రాష్ట్రపార్టీ నాయకత్వంపై ఈటల అసంతృప్తిలో ఉన్నారనే టాక్ వినిపిస్తుంది. ఈటలతో పాటు పార్టీలోని మరికొందరు నేతలకు బండి సంజయ్ వర్గానికి పడటం లేదనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలను అధిష్ఠానం ఢిల్లీకి పిలిపించుకొని మాట్లాడింది. పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆరా తీసింది.