KCR Convoy: సికింద్రాబాద్ కార్ఖాన వద్ద బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (KCR) కాన్వాయ్‌లో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాన్వాయ్‌లో భాగంగా ప్రయాణిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో నేతలు కాసేపు ఆందోళనకు గురయ్యారు. వేముల ప్రశాంత్ రెడ్డి కారును వెనకనుండి మరొక కారు వేగంగా వచ్చి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ప్రశాంత్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం పాక్షికంగా ధ్వంసమైంది.…
కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నేడు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కమిషన్ ముందు బహిరంగ విచారణకు హాజరయ్యారు. ఉదయం శామీర్‌పేట నివాసం నుంచి బీఆర్‌కే భవన్‌కు చేరుకున్న ఈటలను ఓపెన్ కోర్టులో కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. 20 నిమిషాల పాటు బహిరంగ విచారణలో అంతా నిజమే చెప్తానని ఈటల ప్రమాణం చేశారు. కమిషన్ ముందు 113వ సాక్షిగా ఈటల హాజరు కాగా.. బ్యారేజీ నిర్మాణం,…
ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో కేసీఆర్, హరీష్‌రావు భేటీ ముగిసింది.. సుమారు మూడున్నర గంటలపాటు సమావేశం కొనసాగింది. కాళేశ్వరం కమిషన్ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన విచారణపై కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కేవలం రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం విచారణ కమిషన్ ఏర్పాటు చేశారని కేసీఆర్ ఆరోపణలు చేశారు. జూన్ 5న కేసీఆర్, జూన్ 9న హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణలో వినిపించాల్సిన వాదనలు, వివరణలపై చర్చలు జరిపారు.
ఇవాళ ఎవరు కొత్త పార్టీ పెట్టినా నమ్మే పరిస్థితి లేదని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ, బీజేపీలో కలుపుతున్నారన్న వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. కవిత జైల్లో ఉన్నప్పుడు విలీనం కోసం బీఆర్ఎస్ ప్రయత్నం చేయొచ్చన్నారు.. బీజేపీ నుంచి ఎవరూ ప్రయత్నించలేదని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమకారులను కలుస్తానని కవిత అంటోందని.. కవిత కలిసి ఏం చేస్తదని విమర్శించారు. అందులో కొందరు చనిపోయారని.. కొందరు ఇంకెక్కడో ఉన్నారో తెలియదు, మరి కొందరు పార్టీలు…
మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కాళేశ్వరంపై నిజానిజాలు త్వరలో తెలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. "నా డౌట్ అయితే కాంగ్రెస్ వాళ్లే కూలగొట్టి ఉంటారు.. మేడిగడ్డ దగ్గర బాంబో లేదా మరొకటో పెట్టుంటారు.. కాంగ్రెస్‌లో అలాంటి పని చేసే వాళ్లు ఉన్నారు." అని కాంగ్రెస్ నేతలపై సంచలన ఆరోపణలు చేశారు.