Pawan Kaalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లాలోని ముసలి మడుగు ప్రాంతంలో నిర్వహించిన పర్యటనలో స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. ముసలి మడుగులో పర్యటన ముగించుకుని, తిరిగి హెలిప్యాడ్‌కు వెళ్లే సమయంలో ఈ సంఘటన జరిగింది. ఉప ముఖ్యమంత్రిని దగ్గరగా చూడడానికి భారీ సంఖ్యలో స్థానిక ప్రజలు ఒక్కసారిగా కాన్వాయ్ ముందుకు దూసుకువచ్చారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో ఒక మహిళ కిందపడింది. సరిగ్గా అదే సమయంలో కదలడానికి ప్రయత్నించిన పవన్ కళ్యాణ్ కాన్వాయ్…
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గులాబో దేవి కాన్వాయ్ మంగళవారం ప్రమాదానికి గురైంది. ఆమె కాన్వాయ్ ఢిల్లీ నుంచి బిజ్నోర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. పిల్ఖువా కొత్వాలి ప్రాంతంలోని జాతీయ రహదారి-9పై కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ప్రమాదంలో గులాబో దేవి ప్రయాణిస్తున్న కారు కూడా ఢీకొట్టింది. గాయాలపాలైన ఆమెను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
KCR Convoy: సికింద్రాబాద్ కార్ఖాన వద్ద బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (KCR) కాన్వాయ్‌లో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాన్వాయ్‌లో భాగంగా ప్రయాణిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో నేతలు కాసేపు ఆందోళనకు గురయ్యారు. వేముల ప్రశాంత్ రెడ్డి కారును వెనకనుండి మరొక కారు వేగంగా వచ్చి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ప్రశాంత్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం పాక్షికంగా ధ్వంసమైంది.…
బీహార్‌లో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జెడి) నాయకుడు తేజస్వి యాదవ్ తృటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. తేజస్వి యాదవ్ కాన్వాయ్‌లోకి ప్రవేశించిన ఓ ట్రక్కు ఎస్కార్ట్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. రాత్రి 1:30 గంటల ప్రాంతంలో తేజస్వి యాదవ్ మాధేపుర నుంచి పాట్నాకు తిరిగి వస్తున్నారు.
Uttam Kumar Reddy: తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి కాన్వాయ్‌లోని వాహనాలకు ఘోర ప్రమాదం జరిగింది. నేడు మంత్రి హుజూర్‌నగర్ నుండి జాన్‌పహాడ్ ఉర్సు ఉత్సవాలకు వెళ్తున్న కాన్వాయ్ లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో 15 కార్ల ముందు భాగాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. Also Read: Kaushik Reddy: గ్రామసభలో ఉద్రిక్తత.. ఎమ్మెల్యేపై టమాటాలతో దాడి నల్గొండ జిల్లా గరిడేపల్లి వద్ద ఉత్తమ కుమార్ రెడ్డి కాన్వాయ్ వెంట వెలుతున్న కాంగ్రెస్ నేతల వాహనాలు…
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కాన్యాయ్‌ని గుర్తు తెలియని వ్యక్తి ఢీ కొట్టిన సంఘటన కలకలం రేపుతోంది. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి డెలావర్‌లోని వైట్ హౌజ్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి వైట్ హౌజ్ ముందు ఓ వ్యక్తి కారుతో బీభత్సం సృష్టించాడు. తన కారుతో బైడెన్ కాన్వాయ్‌ని ఢీ కొట్టాడు. ఈ ఘటనపై అప్రమత్తమైన పోలీసులు సంఘటన స్థలంలోనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో…