KCR Convoy: సికింద్రాబాద్ కార్ఖాన వద్ద బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (KCR) కాన్వాయ్‌లో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాన్వాయ్‌లో భాగంగా ప్రయాణిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో నేతలు కాసేపు ఆందోళనకు గురయ్యారు. వేముల ప్రశాంత్ రెడ్డి కారును వెనకనుండి మరొక కారు వేగంగా వచ్చి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ప్రశాంత్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం పాక్షికంగా ధ్వంసమైంది.…
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అల్లర్ల ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అగ్నిపథ్ ఆందోళనలతో చెలరేగిన హింసపై విచారణ కొనసాగిస్తున్నారు. ఎవరెవరు ఆందోళనలో పాల్గొన్నారు? వీరంతా ఒక్కసారిగా ఎలా వచ్చారు? వీరు హింసకు పాల్పడేలా ఎవరైనా ఉసిగొల్పారా? అనే కోణంలో ఆధారాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే 52 మంది విద్యార్థులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ఏడుగురు అనుమానితులను రైల్వే పొలీసులు విచారిస్తున్నారు. సీసీ కెమెరా, పోలీస్ వీడియో రికార్డింగ్, మీడియా ఫుటేజ్, సోషల్ మీడియా, సెల్ ఫోన్…