KCR: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన నిర్ణయాలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) పై జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ చేపట్టిన విచారణ ముగిసింది. ఉదయం ప్రారంభమైన ఈ విచారణ సుమారు 50 నిమిషాల పాటు కొనసాగింది. ఈ సమయంలో కేసీఆర్ పలు కీలక అంశాలపై వివరణ ఇచ్చారు. విచారణ సందర్భంగా తాగునీరు, సాగునీటి సమస్యలు, వాటి పరిష్కారానికి తాను తీసుకున్న నిర్ణయాలు, అలాగే భారతదేశంలో నీటి లభ్యత, వినియోగం వంటి…
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు ప్రాజెక్టులు కూలిపోయాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. దీనికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలన్నారు. సిద్దిపేట జిల్లాలోని చిన్నకొడుర్ మండలం చౌడారం వద్ద బిక్కబండకు వెళ్లే కాలువకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడారు. ప్రస్తుత ప్రభుత్వం కాలువల భూ సేకరణ కోసం ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఆరోపించారు.
Harish Rao : తెలంగాణ నీటి హక్కుల కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా జలాలను ఏకపక్షంగా తరలించుకుంటూ తెలంగాణకు నష్టం కలిగిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం నిశ్చలంగా చూస్తుండటం దురదృష్టకరమని ఆయన విమర్శించారు. హరీష్ రావు పేర్కొన్నట్టుగా, గత మూడు నెలలుగా నాగార్జునసాగర్ కుడి కాలువ ద్వారా ఏపీ రోజుకు 10వేల క్యూసెక్కుల నీటిని తీసుకెళ్తోంది. ఏడాది మొత్తంగా ఇది 646 టీఎంసీలకు చేరుకుంటుంది.…
హుజురాబాద్ నియోజకవర్గ రైతులకు ఎస్సారెస్పీ కాలువ ద్వారా నీటిని అందించడంలో ప్రభుత్వం పక్షపాత ధోరణి అవలంబిస్తోందని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం హుజురాబాద్ మండల పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇటీవల కాలంలో కాకతీయ కాలువ ద్వారా నీరు కొనసాగుతున్నప్పటికీ, డీబీఎం 16 ద్వారా హుజురాబాద్ రైతులకు నీరును అందించకుండా నిర్లక్ష్యం చూపుతున్నారని, ఇది అసహనానికి గురిచేస్తోందన్నారు. ఖమ్మం కోసం నీటిని…
నీటిపారుదల అంశాలపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ 3 లేఖలు రాశారు. పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై సమగ్ర అధ్యయనం చేయాలని లేఖలో పేర్కొన్నారు.
డెల్టాకు సాగునీరు విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఖరీఫ్ సాగు ప్రారంభం అవుతున్న వేళ రైతులకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. డెల్టా ప్రాంతంలోని లక్షలాది ఎకరాల పరిధిలో పంటలు వేయాల్సి ఉండగా పంటలకు సాగునీరు అందించే పంట కాలువలు మాత్రం పూడికతో నిండి పోయి ఉన్నాయి. ఇరిగేషన్ రెవెన్యూ శాఖల సమన్వయంతో పంటలకు నీరు అందించాల్సిన అధికారులు కనీసం పంట కాలువల దుస్థితిపై దృష్టి పెట్టకపోవడం రైతులకు ఆందోళన కలిగిస్తోంది. మరో వైపు సాగునీరు విడుదల…