TPCC Meeting: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) విస్తృత స్థాయి సమావేశం నేడు (మంగళవారం) గాంధీభవన్‌లో జరగనుంది. పార్టీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ కీలక భేటీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు, కార్యవర్గ సభ్యులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో కొత్తగా ఎన్నికైన జిల్లా, పట్టణ కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులతో పాటు, ఇదివరకు ఆ పదవుల్లో కొనసాగిన…
హైదరాబాద్ గాంధీభవన్‌లో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు అధ్యక్షతన మహిళా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం జరిగింది. అన్ని జిల్లాల మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్న ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Congress PAC- TPCC Meeting: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఇందులో భాగంగానే, టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ, టీపీసీసీ అడ్వజరీ కమిటీ ఈరోజు ( ఆగస్టు 23న) సాయంత్రం 5 గంటలకి కీలక సమావేశం కానున్నాయి.
కొండా మురళి.. సొంత పార్టీ నేతలని టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. కడియం శ్రీహరి, బసవరాజు సారయ్య, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిలను పరోక్షంగా విమర్శించారు. దీంతో ఆయే నేతలు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఈ వివాదాల నేపథ్యంలో నేడు మంత్రి కొండా సురేఖ, మురళీ కాంగ్రెస్ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ తో భేటి అయ్యారు. తన వ్యాఖ్యలపై ఇంచార్జీ కి వివరణ ఇచ్చారు. ఇంచార్జీ మీనాక్షి నటరాజన్…
Warangal Congress Clash: హైదరాబాద్ లోని గాంధీ భవన్ కి అనుచరులతో వచ్చిన కొండా మురళి కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రమశిక్షణ కమిటీకి ఆరు పేజీలతో కూడిన వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నన్ను కమిటి ముందుకు రండి అని ఎవరు పిలవలేదు.. పార్టీ మీద గౌరవంతో నేనే వచ్చాను అన్నారు.
Congress: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన గాంధీ భవన్ లో 24వ తేదీన ఉదయం 11 గంటలకు పీసీసీ రాజకీయ వ్యవహారాల (పొలిటికల్ అఫైర్స్ కమిటీ పీఏసీ) కమిటీ సమావేశం కానుంది. అనంతరం పీసీసీ సలహా కమిటీ (పీసీసీ అడ్వజరీ కమిటీ పీఏసీ) సమావేశాలు జరగనున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడు పంచాయతీ అంతా.. పదవుల కోసమే. వీలైనంత త్వరలో పిసిసి కమిటీతోపాటు.. కార్పొరేషన్ చైర్మన్స్ ఖాళీలను భర్తీ చేయబోతున్నారు. దీంతో ఆశావాహులంతా పార్టీ నాయకత్వం చుట్టూ తిరుగుతున్నారు. ఎవరి ట్రయల్స్‌లో వాళ్ళు ఉన్నారు. అంతవరకైతే ఫర్లేదుగానీ.... ఏకంగా గాంధీభవన్లో పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ఛాంబర్ ముందు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు
Congress : కాంగ్రెస్ పార్టీలో మహిళా నేతలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ గాంధీ భవన్ లోని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చాంబర్ ఎదుట రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నేతలు బుధవారం నిరసన చేపట్టారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు ఆధ్వర్యంలో మహిళా నాయకులు ఆందోళనకు దిగారు. పార్టీకి అండగా నిలిచిన మహిళా నేతలకు గౌరవం లేకుండా, పదవులు, ప్రభుత్వం, కార్పొరేషన్ లలో ఉన్నతస్థానాలు పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ బంధువులకే…
హెచ్‌సీయూ భూముల వ్యవహారంపై కాంగ్రెస్ నేతల కీలక భేటీ జరగనుంది. ఈ నేపథ్యంలో నేడు ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ కు రానున్నారు. సాయంత్రం 5 గంటలకు హెచ్‌సీయూ భూముల విషయంలో ప్రభుత్వం నియమించిన మంత్రి వర్గ కమిటీ సభ్యులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సమావేశం కానున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో మీనాక్షి నటరాజన్ గాంధీ భవన్లో…
Meenakshi Natarajan తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా నియమితుడైన ఏఐసీసీ ఇంచార్జీ, మీనాక్షి నటరాజన్ శుక్రవారం ఉదయం తెలంగాణ చేరుకున్నారు. ఆమె ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి సాధారణ రైల్లో రావడం విశేషం. కాచిగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ఆమెను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఘనంగా స్వాగతించారు. మహేష్ కుమార్ గౌడ్ ఆమెకు కండువా కప్పి మరింత ఆతిథ్యం అందించారు. ఈ ఘట్టం రాష్ట్ర కాంగ్రెస్ నేతల మధ్య ఆనందాన్ని కలిగించింది. మీనాక్షి నటరాజన్ అనంతరం గాంధీ…