Nirupam: కార్తీక దీపం వంటలక్క ఎంత ఫేమసో.. డాక్టర్ బాబు అంతే ఫేమస్. నిరుపమ్ బయట ఎక్కడ కనిపిస్తే అక్కడ అందరు డాక్టర్ బాబు అని దగ్గరకు వచ్చి .. హీరోల కంటే ఎక్కువ సెల్ఫీలు తీసుకుంటారు. నిజం చెప్పాలంటే.. డాక్టర్ బాబు పేరు నిరుపమ్ అన్న విషయం కూడా తెలియదు చాలామందికి. ఇక సీరియల్స్ లో హీరోగా చేస్తుంటే.. కొన్ని సీరియల్స్ కు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అప్పుడప్పుడు సినిమాల్లో చిన్నా చితకా పాత్రల్లో కనిపించి మెప్పిస్తున్న నిరుపమ్ కు ఒక పెద్ద సినిమా ఆఫర్ వచ్చింది. అదే కుమారి శ్రీమతి. నిత్యామీనన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సిరీస్ అమెజాన్ లో స్ట్రీమింగ్ కావడానికి రెడీ అవుతోంది. గోమతేష్ ఉపాధ్యాయే దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్ ను స్వప్న సినిమాస్ నిర్మిస్తుంది.
Manchu Manoj: ర్యాంప్ ఆడిద్దాం అంటున్న మంచు మనోజ్..
ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో నిత్యామీనన్ కు బావగా నిరుపమ్ కనిపించాడు. ట్రైలర్ మొత్తంలో అతను కూడా ఉండడంతో .. నిరుపమ్ పాత్ర చాలా ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సిరీస్ పై అభిమానులకు ఆసక్తి రెట్టింపు అయ్యింది. నిరుపమ్ మొదటి నుంచి కూడా హీరో అవ్వాలనే ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. అప్పట్లో ఒక సినిమా అతను చేయాల్సి ఉండగా.. కొన్ని కారణాల వలన వేరే హీరో చేయాల్సి వచ్చింది. లేకపోతే ఇప్పటికే నిరుపమ్ హీరోగా మారేవాడు. ఇక ఇన్నేళ్లకు హీరోగా .. అది కూడా నిత్యామీనన్ లాంటి స్టార్ హీరోయిన్ సరసన అంటే లక్కీ ఛాన్స్ అనే చెప్పాలి. ఒకవేళ ఈ సిరీస్ కనుక హిట్ అయితే నిరుపమ్ రేంజ్ మారుతుందని అభిమానులు అంటున్నారు. మరి సెప్టెంబర్ 28 న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సిరీస్ తో నిరుపమ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.