Manchu Manoj:మంచు మోహన్ బాబు చిన్న కొడుకుగా తెలుగుతెరకు పరిచయమయ్యాడు మంచు మనోజ్. దొంగ దొంగది అనే సినిమాతో హీరోగా మారాడు. ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో మనోజ్ కు అవకాశాలు వెల్లువెత్తాయి. ఇక మంచి మంచి కథలను ఎంచుకుంటూ మనోజ్ రాకింగ్ స్టార్ గా మారాడు. విజయాపజయాలను పక్కన పెడితే అభిమానులు మనోజ్ వ్యక్తిత్వాన్ని ఎంతో అభిమానించారు. 2018 తర్వాత మనోజ్ సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చాడు. అతని వ్యక్తిగత విషయాల వలన సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చాడు. అయితే ఆ గ్యాప్ ను ఫుల్ ఫిల్ చేయడానికి ఈ ఏడాది మంచి కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే వాట్ ద ఫిష్ అనే సినిమాతో రీఎంట్రీ ఇస్తున్న మనోజ్ తాజాగా బుల్లితెరపై కూడా తన సత్తా చాటడానికి రెడీ అయ్యాడు. ఈటీవీ విన్ ఛానల్ లో ఒక షోకి మనోజ్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
Manchu Lakshmi: డబ్బు గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన మంచు లక్ష్మీ
ఇక తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమో మేకర్స్ రిలీజ్ చేశారు. ర్యాంప్ ఆడిద్దాం అనే గేమ్ షోకు మనోజ్ పోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఇందుకు సంబంధించిన ఈ ప్రోమోలో మనోజ్ తన జీవితం గురించి చెప్పుకొచ్చాడు. సినిమానే తన ప్రపంచం అని, సినిమాలోనే తాను పెరిగానని తెలుపుతూ సినిమాతో ఉన్న అనుబంధం గురించి చెప్పుకొచ్చాడు. సినిమాల తరువాత ఆ గ్యాప్ వలన ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని, ఎంతోమంది తన పని అయిపోయిందని అన్నారని కూడా తెలిపాడు. ఇక ఈ షో తో మరోసారి తాను కమ్ బ్యాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్టు మనోజ్ చెప్పుకొచ్చాడు. త్వరలోనే ఈ షో ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ షోను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. మరి నటుడిగా హీరోగా మంచి పేరు తెచ్చుకున్న మనోజ్ హోస్ట్ గా ఎలా అలరిస్తాడో చూడాలి.