KA Paul: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పేరు తెలియని వారుండరు.. ఆఫీసర్‌గానే కాదు.. ఆ తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆయన.. గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున విశాఖ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగి ఓటమిపాలయ్యారు.. అయితే, మరోసారి అక్కడి నుంచే పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు.. ఈ సారి ఏ పార్టీ అనేది ఇప్పటి వరకు తేలలేదు.. కానీ, స్టీల్ ప్లాంట్ లాంటి ఇష్యూను తీసుకుని ఫైట్ చేస్తున్నారు.. అయితే, జేడీ లక్ష్మీనారాయణను ప్రజాశాంతి పార్టీలోకి ఆహ్వానించినట్టు ఆ పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ తెలిపారు.. తూర్పుగోదావరి జిల్లాలో మీడియాతో మట్లాడిన ఆయన.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణను ప్రజాశాంతి పార్టీలో చేరాలని ఆహ్వానించా.. పార్టీలో చేరితే కీలక పదవి భాద్యతలు అప్పగిస్తాను అని ప్రకటించారు.. అంతే కాదు.. జేడీ లక్ష్మీనారాయణ తమ పార్టీలో చేరతారని ఆశిస్తున్నానన్నారు.. అంతే కాదు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా కలిసి పనిచేయడానికి ముందుకు రావాలని వ్యాఖ్యానించారు కేఏ పాల్..
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
మరోవైపు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవకాశమిస్తే వారి ఇంటికి వెళ్లి కలుస్తానన్నారు కేఏ పాల్.. ఇక, హైదరాబాద్ లో వైఎస్ షర్మిల రెడ్డి, వైఎస్. విజయమ్మలు పోలీసులపై దాడి చేయడం అమానుషంగా పేర్కొన్నారు.. ప్రజాస్వామ్యంలో పోరాడాలి తప్ప పోలీసులపై దాడి చేయకూడదని హితవుపలికారు కేఏ పాల్. కాగా, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఈ మధ్యే సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. కేఏ పాల్‌తో సమావేశమైన విషయం విదితమే. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడటం కోసం తన ఆస్తులను కూడా అమ్ముతానని పాల్ చెప్పారు. తనకు ప్రాణహాని ఉందని… తనను అరెస్ట్ చేయాలని కూడా చూస్తున్నారని చెప్పారు. అయితే, జేడీ లక్ష్మీనారాయణ విషయంలో పాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయాయి.