జార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీతా సోరెన్‌పై జేఎంఎం అధిష్టానం వేటు వేసింది. ఆమెను పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఆమెపై ఈ వేటు పడింది. ఇదిలా ఉంటే ఆమె సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీలో చేరారు. సీతా సోరెన్.. హేమంత్ సోరెన్ వదిన.
ఇది కూడా చదవండి: Kanhaiya Kumar: కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్‌పై దాడి..
జార్ఖండ్‌లో జేఎంఎం నుంచి సీతా సోరెన్ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఆమె మార్చిలో బీజేపీలో చేరారు. దీంతో పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి ఆరేళ్లపాటు జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) శుక్రవారం బహిష్కరించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఆమెను బహిష్కరించినట్లు జేఎంఎం ఒక ప్రకటనలో తెలిపింది. మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్న సీతా సోరెన్.. 2009లో తన భర్త దుర్గా సోరెన్ మరణించినప్పటి నుంచి జేఎంఎంలో ఒంటరితనం మరియు నిర్లక్ష్యం కారణంగా మార్చి 20న ఢిల్లీలో BJPలో చేరారు.
ఇది కూడా చదవండి: AP Violence: హింసాత్మక ఘటనలపై ఐపీఎస్ వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు
2019 ఎన్నికల్లో JMM అధ్యక్షుడు శిబు సోరెన్‌ను 47,590 ఓట్ల తేడాతో ఓడించిన సిట్టింగ్ ఎంపీ సునీల్ సోరెన్ స్థానంలో బీజేపీ ఆమెను దుమ్కా లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దింపింది. జూన్ 1న దుమ్కాకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి.
ఇది కూడా చదవండి: Indonesia: 90 నిమిషాల్లో 5 సార్లు విస్పోటనం చెందిన అగ్నిపర్వతం..