Indonesia: ఇండోనేషియాలోని సెమెరు అగ్ని పర్వతం బద్ధలైంది. తూర్పు జావా ప్రావిన్స్‌లో ఉన్న ఈ అగ్నిపర్వతం ఒకే రోజు 5 సార్లు విస్పోటనం చెందింది. దాని శిఖరం పై నుంచి దాదాపుగా 900 మీటర్ల వరకు బూడిదను వెదల్లిందని సెంటర్ ఫర్ వాల్కనాలజీ అండ్ జియోలాజికల్ హజార్డ్ మిటిగేషన్ తెలిపింది. మొదటి విస్పోటనం స్థానిక కాలమాన ప్రకారం 6.29 కి చోటు చేసుకుంది. 90 నిమిషాల వ్యవధిలోనే 5 సార్లు అగ్నిపర్వతం విస్పోటనం చెందింది. అయితే, అగ్ని పర్వతం ప్రమాదకరంగా మారడంతో దానికి దూరంగా ఉండాలని అధికారులు ప్రజలకి సూచించారు. అగ్నిపర్వతం నుంచి ఉద్భవించే నదులకు దూరంగా ఉండాలని ప్రజలను కోరారు.
Read Also: Sonia Gandhi: ‘‘నా కొడుకుని మీ చేతుల్లో పెట్టా’’ .. రాయ్‌బరేలీలో సోనియా గాంధీ కామెంట్స్..
ఇండోనేషియా ప్రపంచంలోనే ఎక్కువ అగ్నిపర్వతాలు ఉన్న దేశాల్లో ఒకటి. ప్రపంచంలో క్రియాశీలక అగ్నిపర్వతాలు ఈ దేశంలోనే ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రాంతం పసిఫిక్ మహాసముద్రంలో ‘‘రింగ్ ఆఫ్ ఫైర్’’ అనే భాగంలో ఉంది. ఈ ప్రాంతంలో భూమి అడుగున టెక్టానిక్ ప్లేట్ కదలికలు ఎక్కువగా ఉండటంతో పాటు అనేక సంఖ్యలో అగ్నిపర్వతాలను కలిగి ఉంటుంది. భూ అంతర్భాగంలో జరిగే చర్యల వలన ఇక్కడి అగ్నిపర్వతాలు బద్ధలవుతుంటాయి.