ఎమ్మెల్సీ చింతపండు నీవన్ (తీన్నార్ మల్లన్న)కు బిగ్ షాక్ తగిలింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఇటీవల బీసీ సభలో ఓ వర్గంపై మల్లన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలాకు పాల్పడుతున్నట్లు హైకమాండ్ గుర్తించింది.
పంజాబ్ బీజేపీ చాలా మంది నేతలపై చర్యలు తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కారణంగా మాజీ క్యాబినెట్ మంత్రితో సహా డజను మంది నాయకులను 6 సంవత్సరాల పాటు పార్టీ నుంచి బహిష్కరించింది. వేటు పడిన వారిలో భగత్ చున్నీలాల్ కూడా ఉన్నారు. ఆయన పంజాబ్ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు.
జార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీతా సోరెన్‌పై జేఎంఎం అధిష్టానం వేటు వేసింది. ఆమెను పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఆమెపై ఈ వేటు పడింది.