వైఎస్సార్ హయాంలో 38 వేల కోట్లతో గోదావరి నది జలల్లో వృధాగా పోతున్న నీటిని ఒడిసిపట్టడానికి ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్ట్ రూపొందించామన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఇవాళ జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాజెక్ట్ ను రి డిజైన్ పేరు తో కాళేశ్వరం ప్రొజక్ట్ గా పేరు మర్చి 1,20,000కోట్ల వ్యయం తో ఏర్పాటు చేశారన్నారు. కాళేశ్వరం అవినీతి పై సిట్టింగ్ జడ్జి తో విచారణ చెపడతాం కెసిఆర్ కటాకటాల వెనక్కి పోవడం తథ్యమన్నారు. తెలంగాణ ప్రజలు ఓటు అనే విష్ణుచక్రం తో కెసిఆర్ ని ఒడిస్తారన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.
Also Read : Fake ED Commissioner: తిరుమలలో నకిలీ ఈడీ కమీషనర్ ను అరెస్టు..
అంతేకాకుండా.. ‘కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రాంతం నిషేధిత ప్రాంతం గా మారింది. వరదల్లో నీటమునిగిన 11 పంపు సెట్ల ను చూడడానికి కూడా ఎవరికీ అనుమాతి లేదు. మెడిగడ్డ బ్యారేజ్ లో 20 వ పిల్లరు బ్రిడ్జి కుంగింది.
కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ని నా మేదోమథనం అన్నాడు. ఏమైంది ఇప్పడు మేడి గడ్డ బ్యారేజ్ పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి పై కెసిఆర్ ఏ నాటికైనా న్యాయవిచారణ ఎదుర్కోవాల్సిందే.
కాళేశ్వరం ప్రాజెక్ట్ ను కెసిఆర్ అవినీతి ప్రాజెక్ట్ గా మార్చారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి పై బీజేపీ నాయకులు మాటలకే పరిమితం అవుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి పై కేంద్ర ప్రభుత్వం విచారణ ఎందుకు చేయడం లేదు. కేసీఆర్, కేంద్రం లో ఉన్న బీజేపీ ప్రభుత్వ అంతర్గత ఒప్పందం లో భాగమే కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి. కేసీఆర్ స్వార్థం, అవినీతి, కమిషన్ లా కక్కుర్తే కాళేశ్వరం ప్రాజెక్ట్. 2 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లో కి రాగానే కాళేశ్వరం ప్రాజెక్ట్ లోఅవినీతి ని బట్టబయలు చేస్తాము. మేడిగడ్డ బ్యారేజ్ 20 వ పిల్లరు అప్రొచు రోడ్ కుంగింది. మేడిగడ్డ బ్యారేజ్ పరిస్థితి ఏంటో ప్రస్తుతం అర్థం కావడం లేదు’ అని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Also Read : Iran: మహ్సా అమిని మరణాన్ని కవర్ చేసిన ఇద్దరు మహిళ జర్నలిస్టులకు జైలు శిక్ష..