కటక్‌లోని బారాబతి స్టేడియంలో జరిగిన మొదటి T20Iలో భారత్ దక్షిణాఫ్రికాను 101 పరుగుల తేడాతో ఓడించింది. హార్దిక్ పాండ్యా (59*) అర్ధ సెంచరీతో చెలరేగాడు. ఆ తర్వాత బౌలర్లు అద్భుతంగా రాణించి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ కు 1-0 ఆధిక్యాన్ని అందించారు. ఈ మ్యాచ్ లో ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు పడగొట్టాడు. దీనితో జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనతను సాధించాడు. ఇప్పటివరకు ఏ భారత బౌలర్ కూడా ఈ ఘనతను సాధించలేదు. ఈ మ్యాచ్‌లో బుమ్రా మూడు ఓవర్లు బౌలింగ్ చేసి 17 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.
Also Read:CM Revanth Reddy : జల్, జంగిల్, జమీన్ అని కొమురం భీమ్ పోరాడిన గడ్డ ఇది
మొదటి రెండు ఓవర్లలో వికెట్ దక్కలేదు. అయితే, డ్రింక్స్ బ్రేక్ తర్వాత, సూర్యకుమార్ యాదవ్ బంతిని బూమ్-బూమ్‌కు అప్పగించాడు. రెండవ బంతికి, అతను డెవాల్డ్ బ్రూవిస్ (22)ను ట్రాప్ చేశాడు. దీనితో బుమ్రా అంతర్జాతీయ టీ20ల్లో 100 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. మూడు ఫార్మాట్లలో 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. అంతేకాకుండా, ఈ ఘనత సాధించిన ప్రపంచంలో ఐదవ బౌలర్‌గా నిలిచాడు. 11వ ఓవర్ ఐదవ బంతికి కేశవ్ మహారాజ్ (0)ను భారత ఫాస్ట్ బౌలర్ అవుట్ చేశాడు.
మూడు ఫార్మాట్లలో 100 వికెట్లు
లసిత్ మలింగ
టిమ్ సౌథీ
షకీబ్ అల్ హసన్
షాహీన్ అఫ్రిది
జస్‌ప్రీత్ బుమ్రా
బుమ్రా తన కెరీర్‌లో ఇప్పటివరకు 52 టెస్టుల్లో 99 ఇన్నింగ్స్‌ల్లో 19.79 సగటు, 2.77 ఎకానమీతో 234 వికెట్లు పడగొట్టాడు. ఈ భారత ఫాస్ట్ బౌలర్ 89 వన్డేల్లో 88 ఇన్నింగ్స్‌ల్లో 149 వికెట్లు పడగొట్టాడు. 81 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 101 వికెట్లు పడగొట్టాడు. టీ 20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లలో బుమ్రా రెండవ స్థానంలో ఉన్నాడు, అర్ష్‌దీప్ సింగ్ మొదటి స్థానంలో ఉన్నాడు.
Also Read:Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
టీ20 ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్
అర్ష్‌దీప్ సింగ్: 107
జస్‌ప్రీత్ బుమ్రా: 101
హార్దిక్ పాండ్యా: 99
యుజ్వేంద్ర చాహల్: 96
భువనేశ్వర్ కుమార్: 90