Nadendla Manohar: సలహాదారులనే వ్యవస్థను ఏర్పాటు చేసిన వైసీపీ.. వారిని రాజ్యాంగేతర శక్తులుగా మారుస్తోందని సంచలన ఆరోపణలు చేశారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.. సలహాదారుల వ్యవస్థపై.. వారిపై పెట్టిన ఖర్చుల అంశాన్ని ప్రస్తావిస్తే.. సమాధానం చెప్పని వైసీపీ.. అర్థం లేకుండా దుష్ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యారు. సలహాదారుల వ్యవస్థపై బహిరంగ చర్చకు సిద్దం అంటూ సవాల్ చేసిన ఆయన.. ఇష్టం వచ్చినట్టు సలహాదారులను నియమిస్తున్నారని కోర్టులు కూడా తప్పు పట్టింది. మాది బుకాయింపు కాదు.. వైసీపీదే బరితెగింపు. ఫ్యాక్ట్ చెక్ లో ఓ రకంగా.. వైసీపీ సోషల్ మీడియాలో మరో రకంగా వివరాలిస్తారు. సీఎం జగన్‌కు ఉపనాస్యాలు రాసిచ్చే సలహాదారుకు రూ. 2.20 లక్షల మేర జీతం ఇస్తున్నారు. కానీ, మంత్రికి బేసిక్ జీతం రూ. 14 వేలు. మరో సలహాదారుకు అవసరానికి మించిన సెక్యూర్టీ అంటూ విమర్శలు గుప్పించారు.
Read Also: Uttar Pradesh: పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తుందని.. ప్రియురాలి గొంతు నులిమి చంపిన వ్యక్తి..
స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ నిధులను సలహాదారుని కార్యాలయం అద్దె నిమిత్తం చెల్లిస్తున్నారని ఆరోపించారు నాదెండ్ల.. యువత, ఉపాధి కోసం వినియోగించాల్సిన నిధులను సలహాదారుల అద్దె కోసం వినియోగిస్తారా..? సలహాదారులకు ప్రొటోకాల్ ఖర్చులు కూడా ఇస్తున్నారు. సలహాదారులకు ప్రొటోకాల్ ఖర్చులేంటీ..? రాజ్యాంగంలో ప్రొటోకాల్ ఎవరికివ్వాలోనని స్పష్టంగా ఉంటుంది. సలహాదారులకు ప్రొటోకాల్ ఏంటీ..? 55 నెలల్లో ఎంత మంది సలహాదారులను నియమిస్తున్నారు. ఈ సలహాదారులు ఏం సలహాలిస్తున్నారు..? సలహాదారుల నియామకంలో కొత్త పాలసీ తెస్తున్నామని ప్రభుత్వం కోర్టుకు చెప్పింది. సలహాదారుల పాలసీ ఏమైంది..? సలహాదారుల క్వాలిఫికేషన్లు ఏంటీ..? అంటూ వరుసగా ప్రశ్నల వర్షం కురిపించారు. మేం అడిగిన వివరాలు.. మా డిమాండ్లను వైసీపీ చెప్పడం లేదన్నారు.. సలహాదారుల విషయంలో నా లెక్క తప్పైతే.. ఆ వివరాలు ఇవ్వాలి కదా..? అని సవాల్ విసిరారు. గుట్టు చప్పుడు కాకుండా ఇంకెంత మంది సలహాదారులకు జీతాలు పెంచి ఉంటారో తెలియాల్సి ఉందన్నారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.