Janasena Leaders Meet Chandrababu: జనసేనలో అంతర్మథనం.. సీట్ల సంఖ్యపై కేడర్ అసంతృప్తి.. మరోసారి చంద్రబాబుతో కీలక భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Janasena Leaders Meet Chandrababu: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల నేపథ్యంలో కూటమిలో సీట్ల సర్దుబాటు అంశం మరోసారి చర్చకు వచ్చింది. ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో జనసేన నేతలు సమావేశమై కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో సీట్ల కేటాయింపుపై చర్చించినట్లు సమాచారం. ఉండవల్లిలోని సీఎం నివాసానికి జనసేన నేతలు నాదెండ్ల మనోహర్, లింగమనేని రమేష్ వచ్చారు.
మరోవైపు, స్థానిక ఎన్నికల్లో సీట్ల కేటాయింపు సరిగా జరగలేదంటూ జనసేన కేడర్ నుంచి అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో పార్టీలో అంతర్మథనం కొనసాగుతోంది. ఈ అంశంపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. పార్టీ కో-ఆర్డినేషన్ కమిటీతో సమావేశమయ్యారు. దాదాపు రెండు గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో స్థానిక ఎన్నికల్లో పోటీ, సీట్ల సంఖ్య, కేటాయింపులపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. స్థానిక ఎన్నికల్లో జనసేనకు దక్కే సీట్ల సంఖ్యపై పార్టీలో అసంతృప్తి కొనసాగుతున్నట్లు సమాచారం. పోటీ చేయబోయే అభ్యర్థుల వివరాలు ఇంకా పూర్తిస్థాయిలో కొలిక్కి రాకపోవడంతో తదుపరి కార్యాచరణపై చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబుతో జనసేన నేతల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో సీట్ల సర్దుబాటుపై చర్చలు ఏ మేరకు ఫలిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.
Also Read
- President Droupadi Murmu: లఖ్పతి దీదీలు కాదు.. కరోడ్పతి దీదీలుగా ఎదగాలి.. రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు..
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Jana Sena Party: జనసేనలోకి పలువురు వైసీపీ నేతలు, ప్రముఖులు.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్..
- AP Alliance Seat Sharing: సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి.. కూటమి నుంచి సింగిల్ లిస్ట్.. బొలిశెట్టి కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Bhatti Vikramarka : తెలంగాణలో పెట్టుబడులకు అండగా ఉంటాం..
-
BYD Atto 8 EV: కేవలం 9 నిమిషాల్లో 97% ఛార్జింగ్! BYD కొత్త ఎలక్ట్రిక్ SUV.. 651 కి.మీ. రేంజ్తో వస్తోంది!
-
Janasena Leaders Meet Chandrababu: జనసేనలో అంతర్మథనం.. సీట్ల సంఖ్యపై కేడర్ అసంతృప్తి.. మరోసారి చంద్రబాబుతో కీలక భేటీ
-
Telangana Studies: వియత్నాం విద్యా మోడల్పై తెలంగాణ ఫోకస్.. మనబడిలో ఏం మారబోతోంది?
-
Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్.. ఇప్పట్లో థియేటర్లలోకి రాని రెబల్ స్టార్!
ట్రెండింగ్
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..