Jana Sena Party: జనసేనలోకి పలువురు వైసీపీ నేతలు, ప్రముఖులు.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jana Sena Party: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో రాజకీయ వలసలు కొనసాగుతున్నాయి.. ఇవాళ జనసేన పార్టీలోకి వైసీపీ నాయకులు, వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు చేరారు. బుధవారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యా్ణ్ సమక్షంలో వీరంతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పవన్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
జనసేనలో చేరిన వారిలో వైసీపీ నాయకుడు, శ్రీకాకుళం మాజీ డీసీసీబీ చైర్మన్ డోలా జగన్, తిరుపతికి చెందిన పెనుమాదు ప్రణీత్, ఆచంటకు చెందిన జిల్లా బీసీ సంక్షేమ సంఘం నాయకుడు తుంగ నాగేశ్వరరావు ఉన్నారు. వీరితో పాటు వివిధ రంగాలకు చెందిన ఏడీఎస్ ప్రసాద్, మారుతి, దోవరీ అమర్నాథ్ కూడా జనసేన పార్టీలో చేరారు. పార్టీలోకి కొత్తగా చేరిన వారిని ఆహ్వానించిన అనంతరం పవన్ కల్యాణ్ వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జనసేన పార్టీ ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ప్రజాక్షేత్రంలో నిస్వార్థంగా పనిచేస్తూ ప్రజలకు సేవ చేయాలని సూచించారు.
Also Read
- AP Alliance Seat Sharing: సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి.. కూటమి నుంచి సింగిల్ లిస్ట్.. బొలిశెట్టి కీలక వ్యాఖ్యలు
- Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
- TDP-Janasena Seat Sharing Talks: సీట్ల లొల్లి.. కూటమి ముందు జనసేన భారీ డిమాండ్..
- AP Model Code of Conduct: ఏపీలో అమల్లోకి ఎన్నికల కోడ్.. కొత్త పథకాలు, ప్రాజెక్టులకు బ్రేక్.. నిబంధనలు ఇవే..
వివిధ రాజకీయ, సామాజిక రంగాలకు చెందిన నాయకులు, ప్రముఖులు జనసేనలో చేరడంతో పార్టీ కార్యకలాపాలకు మరింత ఊతం లభిస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రజల్లోకి పార్టీ సిద్ధాంతాలను తీసుకెళ్లడం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడంపై పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. మరోవైపు.. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ కూడా ఈ రోజు జనసేనలో చేరారు.. పార్టీ కండువా కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు పవన్.. పార్టీలో చేరేందుకు జనసేన కేంద్ర కార్యాలయానికి వచ్చిన వంగవీటి రాధాకృష్ణని పవన్ ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని సాదరంగా స్వాగతం పలికారు. జనసేన పార్టీ సిద్ధాంతాల కోసం కలసికట్టుగా పని చేద్దామని, ప్రజాసేవలో సమష్టిగా ముందుకు వెళదామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు.
తాజావార్తలు
-
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..
-
Jana Sena Party: జనసేనలోకి పలువురు వైసీపీ నేతలు, ప్రముఖులు.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్..
-
Sharannavaratri Special: శరన్నవరాత్రుల్లో ప్రత్యేక ఆకర్షణ.. కోటి రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారికి విశేష అలంకరణ!
-
Haindava Teaser: “ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?”.. ‘హైందవ’ టీజర్ చూశారా!
-
Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..