AP Alliance Seat Sharing: సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి.. కూటమి నుంచి సింగిల్ లిస్ట్.. బొలిశెట్టి కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Alliance Seat Sharing: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల వేళ కూటమి పార్టీల సీట్ల చర్చలపై అంతా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.. సీట్ల సర్దుబాటు ఎలా ఉండబోతుందనే ఉత్కంఠ నెలకొనగా.. సమన్వయ సమావేశాలు కూడా సుదీర్ఘంగా జరగడంతో అంతా దానిపైనే ఫోకస్ పెట్టారు.. అయితే, కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి వచ్చాయని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. అమరావతిలో నిర్వహించిన కూటమి సమన్వయ కమిటీ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మాట్లాడారు. గతంలో వచ్చిన మెజార్టీ కంటే మెరుగైన మెజార్టీ సాధించడమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. గెలుపే ప్రధానమని, ఎక్కడ కూటమి బలంగా ఉందో అక్కడ పోటీ చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూచించినట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రజలు కూటమిపై నమ్మకంతో ఓట్లు వేశారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా నిర్ణయాలు తీసుకుంటామని బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. సీట్ల సర్దుబాటు విషయంలో కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా వ్యవహరిస్తామని చెప్పారు. కూటమి పార్టీల మధ్య చర్చలు ఒక కొలిక్కి వచ్చాయని, ఇకపై ఎలాంటి ఫ్రెండ్లీ కాంటెస్ట్ ఉండదని స్పష్టం చేశారు. ప్రతి స్థానంలోనూ కూటమి తరఫున ఒక్క అభ్యర్థి మాత్రమే పోటీలో ఉంటారని తెలిపారు. సీట్ల కేటాయింపులో ఎలాంటి పరిమితులు లేవని పేర్కొన్నారు.
Also Read
- Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
- TDP-Janasena Seat Sharing Talks: సీట్ల లొల్లి.. కూటమి ముందు జనసేన భారీ డిమాండ్..
- AP Model Code of Conduct: ఏపీలో అమల్లోకి ఎన్నికల కోడ్.. కొత్త పథకాలు, ప్రాజెక్టులకు బ్రేక్.. నిబంధనలు ఇవే..
- AP Local Body Election Schedule 2026: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. పూర్తి షెడ్యూల్ ఇదే..
మరోవైపు, కూటమి నుంచి అభ్యర్థుల ఉమ్మడి జాబితా త్వరలో విడుదల కానుందని వంశీ కృష్ణ యాదవ్ తెలిపారు. రేపో, ఎల్లుండో జాబితా ప్రకటించే అవకాశం ఉందని చెప్పారు. రెండు రోజుల్లో కూటమి తరఫున సింగిల్ లిస్ట్ విడుదలవుతుందని వెల్లడించారు. 2024లో జరిగిన ఎన్నికల ఫలితాల కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలన్నదే కూటమి లక్ష్యమని నాయకులు పేర్కొన్నారు. సీట్ల సర్దుబాటు పూర్తయిన నేపథ్యంలో అభ్యర్థుల జాబితాపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అధికారిక జాబితా విడుదలైన తర్వాత ఏ పార్టీకి ఎన్ని స్థానాలు కేటాయించారు, ఎవరెవరికి అభ్యర్థులుగా అవకాశం కల్పించారనే అంశాలపై స్పష్టత రానుంది.
తాజావార్తలు
-
Haindava Teaser: “ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?”.. ‘హైందవ’ టీజర్ చూశారా!
-
Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
-
AP Alliance Seat Sharing: సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి.. కూటమి నుంచి సింగిల్ లిస్ట్.. బొలిశెట్టి కీలక వ్యాఖ్యలు
-
Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
-
SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..