AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP MPTC, ZPTC Elections: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం.. మరోవైపు.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన అంశంపై హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు వీలుగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో లేదా ఎన్నికల అధికారి కార్యాలయాల్లో తగిన ఏర్పాట్లు చేయాలని వైఎస్సార్సీపీ తన పిటిషన్లో విజ్ఞప్తి చేసింది. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు నామినేషన్ల ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరింది. ఇదిలా ఉండగా, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కుల ధ్రువీకరణ పత్రాలు, నో డ్యూస్ సర్టిఫికెట్లు జారీ చేయడానికి సంబంధించిన అంశంపై మరో పిటిషన్ కూడా దాఖలైంది. ఈ రెండో పిటిషన్పై విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. దీంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన పిటిషన్లపై హైకోర్టు తదుపరి చర్యలు ఎలా ఉండనున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.
Also Read
- Jana Sena Party: జనసేనలోకి పలువురు వైసీపీ నేతలు, ప్రముఖులు.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్..
- AP Alliance Seat Sharing: సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి.. కూటమి నుంచి సింగిల్ లిస్ట్.. బొలిశెట్టి కీలక వ్యాఖ్యలు
- Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
- TDP-Janasena Seat Sharing Talks: సీట్ల లొల్లి.. కూటమి ముందు జనసేన భారీ డిమాండ్..
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
-
Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..