Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Keemo Paul Comments Goes Viral after Five Wicket Haul: బుధవారం రాత్రి హైదరాబాద్‌లో భారత్‌తో జరిగిన నాలుగో టీ20లో వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కరీబియన్ జట్టు భారీ స్కోరు సాధించడంతో పాటు బౌలింగ్‌లోనూ రాణించి అద్భుత విజయాన్ని అందుకుంది. విండీస్ గెలుపులో బౌలర్ కీమో పాల్ కీలక పాత్ర పోషించాడు. నాలుగు ఓవర్లలో 41 రన్స్ ఇచ్చి 5 వికెట్స్ పడగొట్టాడు. ఈ పర్యటనలో రెండోసారి ఐదు వికెట్ల ఘనత సాధించడంపై కీమో పాల్ సంతోషం వ్యక్తం చేశాడు. జట్టుకు తన వంతుగా విజయం అందించడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నాడు.
చాలా సంతోషంగా ఉంది:
మ్యాచ్ అనంతరం కీమో పాల్ మాట్లాడుతూ.. ‘డెత్ ఓవర్లలో బ్యాటింగ్ చేస్తున్న ఇద్దరు సెటిల్ అయిన బ్యాటర్లను కట్టడి చేయడానికి మా వద్ద స్పష్టమైన ప్రణాళిక ఉంది. నేను ముందుగా యార్కర్లు వేయడానికి ప్రయత్నిస్తా. అవి ఫలించకపోతే బ్యాటర్‌ను లక్ష్యంగా చేసుకుని బౌలింగ్ చేస్తా. హైదరాబాద్ పిచ్‌పై స్లో బంతులు కొంతమేర గ్రిప్ అయ్యాయి. అందుకే ఒకే తరహా బంతులు వేయకుండా వైవిధ్యం చూపించా. ఏడాదికి పైగా విరామం తర్వాత వెస్టిండీస్ జట్టులోకి తిరిగి వచ్చి నా వంతు సహకారం అందించడం చాలా సంతోషంగా ఉంది. నన్ను ఆరోగ్యంగా ఉంచి, మైదానంలో ఆడే అవకాశం కల్పిస్తున్న ఆ దేవుడికి కృతజ్ఞతలు. జట్టులోని ఆటగాళ్లు మంచి సమన్వయంతో ఆడుతున్నారు. షాయ్ హోప్ అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు. ఈ టీ20 టోర్నీలో పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాము. అవకాశం వచ్చినప్పుడల్లా జట్టుకు ఉపయోగపడాలనేదే నా లక్ష్యం’ అని చెప్పాడు.
Also Read
- ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
- Shai Hope: 244 టార్గెట్ సరిపోదనుకున్నాను.. అక్కడే మలుపు తిరిగింది: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: మా వ్యూహం దెబ్బతిన్నది.. అదే కొంపముంచింది..
- Ind vs WI: తేలిపోయిన భారత బౌలర్లు.. భారత్‌పై వెస్టిండీస్ ఘన విజయం..
గెలవాలనే కసి మరింత పెరిగింది:
తప్పక గెలవాల్సిన మ్యాచ్ కావడంతో ఒత్తిడి పెరిగిందా? అనే ప్రశ్నకు కీమో పాల్ స్పందిస్తూ.. ‘అదనపు ఒత్తిడిగా భావించలేదు. అయితే ఆటగాళ్లలో ఉత్సాహం, పట్టుదల, గెలవాలనే కసి మరింత పెరిగాయి. ఆ స్ఫూర్తితోనే మ్యాచ్‌లో విజయం సాధించాము. తదుపరి మ్యాచ్‌లోనూ ఇదే ప్రదర్శన చేస్తాం. తప్పకుండా సిరీస్ గెలుస్తాం. స్పిన్నర్ గుడాకేశ్ బాగా బంతులు వేశాడు. ఇద్దరు ఎడమచేతి వాటం బ్యాటర్లు క్రీజులో కుదురుకున్న సమయంలో బౌలింగ్‌కు వచ్చిన మోటీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కీలక సమయంలో వికెట్లు తీయడం ద్వారా జట్టుకు ఉపయోగపడ్డాడు’ అని ప్రశంసలు కురిపించాడు.
ఏ జట్టైనా మేము భయపడం:
తమ జట్టు ఆత్మవిశ్వాసంతో ఉందని, ఆటగాళ్లంతా తమ నైపుణ్యాలపై నమ్మకం ఉంచుతున్నారని కీమో పాల్ స్పష్టం చేశాడు. ‘మా రోజు వస్తే ఏ జట్టునైనా ఓడించగలం. ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజీలాండ్.. మరే జట్టైనా మేము భయపడం. అన్ని జట్లు మా ఒకటే. కలిసికట్టుగా ఆడి గెలవడమే మా టార్గెట్. ప్రశాంతంగా ఉండటం, మాపై మును నమ్మకం ఉంచి ఆడుతున్నాం. అదే మా విజయానికి కారణం’ అని కీమో పాల్ చెప్పుకొచ్చాడు. నాలుగో టీ20లో వెస్టిండీస్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో భారత్ 19.3 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది. దీంతో విండీస్ 24 పరుగుల తేడాతో విజయం సాధించింది.
తాజావార్తలు
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
INDIA Bloc: సీఈసీకి వ్యతిరేకంగా నేడు చెన్నైలో విపక్ష కూటమి నిరసన.. పాల్గొననున్న టీవీకే
-
మళ్లీ తెరపైకి Ankita Bhandari Case.. ఢిల్లీలో అంకిత తల్లిదండ్రుల నిరసన.. రాహుల్ గాంధీ మద్దతు..!
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఈ రాశుల వారికి మిశ్రమ ఫలితాలు.. మరి ఏం చేయాలి?
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..