ఏపీ స్థానిక ఎన్నికల్లో మరో ప్రక్రియ ముగిసింది. ఇప్పటివరకు దాఖలైన నామినేషన్లు పరిశీలించిన ఎన్నికల అధికారులు.. సరైన ఫార్మాట్లో లేని వాటిని తిరస్కరించారు. తిరుపతి, నెల్లూరు, చిత్తూరుతో పాటు కొన్నిచోట్ల నామినేషన్ల తిరస్కరణ ఉద్రిక్తతలకు దారి తీసింది. కొన్ని ప్రాంతాల్లో వైసీపీ, టీడీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు.అభ్యర్థులు తమ నామినేషన్లను ఈ నెల 9వ తేదీలోపు ఉపసంహరించుకోవచ్చు. అదేరోజు మధ్యాహ్నం 3 గంటల తరువాత పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు. నవంబర్ 14న…