ఫ్లెక్సీ వార్ పై వర్గపోరుపై రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు స్పందించారు. తెలుగు తమ్ముళ్లు ఒక మహిళా సర్పంచ్ పై దాడికి దిగడం ఆ పార్టీ దిగజారుడు తనాన్ని బయటపడుతుందని ఎద్దేవా చేశారు. లోకేష్ యువగళం పాదయాత్ర ఎక్కడ జరిగినా.. వారి వర్గపోరు బహిర్గతం అవుతుందని అన్నారు. లోకేశ్ నిర్వహించే పాదయాత్ర.. యువగళం కాదని గొడవలగళంగా వర్ణించారు.
Rapaka Varaprasad: రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి.. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. దీంతో.. మరోసారి వైరల్ గా మారిపోయింది రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యల వీడియో.. అయితే, గతంలో తాను సర్పంచ్ గా దొంగ ఓట్లుతో గెలిచానని వ్యాఖ్యానించారు ఎమ్మెల్యే రాపాక.. చింతలమోరి గ్రామంలో నా ఇంటి…
కోనసీమ జిల్లా రాజోలు వైసీపీలో మళ్ళీ రచ్చ మొదలైంది. రాజోలు వైసీపీ నేత బొంతు రాజేశ్వరరావు పార్టీని వీడుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. బొంతు రాజేశ్వరరావు ప్రస్తుతం వైసీపీ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావుపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. అనుచరులతో జరిగిన సమావేశంలో బొంతు రాజేశ్వరరావు మాటలు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారాయి. రెండు రోజుల క్రితమే బొంతు రాజేశ్వరరావు ఇంటికెళ్లి ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు వైసీపీ ప్లీనరీ సమావేశానికి ఆహ్వానించారు. అయితే ఇప్పటికే పార్టీ…
కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం వైసిపి సంక్షోభంలో పడింది. జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు వైసిపిలో ప్రాధాన్యత ఇవ్వడం, నియోజకవర్గ వైసిపి శ్రేణులకు మింగుడు పడటంలేదు. వైసిపికి రాజోలు నియోజకవర్గంలో కో – ఆర్డినేటర్ గా పెదపాటి అమ్మాజీ, మాజీ కో – ఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావు లను ప్రక్కన పెట్టి ఎమ్మెల్యే రాపాకకు ప్రాధాన్యత ఇచ్చారు. దీనితో వైసిపి ఆవిర్భావం నుంచి ఉన్న నేతలు డీలా పడ్డారు. ఇటీవల అమలాపురంలో జరిగిన కోనసీమ జిల్లా…
వారిద్దరూ మిత్రులు కాదు. అలా అని శత్రువులు కారు. ఒకరు అధికారపార్టీ అని చెప్పుకొంటున్న ఎమ్మెల్యే. ఇంకొకరు టీడీపీ నేత. అకస్మాతుగా ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. దెప్పిపొడుపు మాటలతో తమలోని కళను బయటపెడుతున్నారు. ఆ గిల్లికజ్జాల కథేంటో ఇప్పుడు చూద్దాం. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో దూషణతూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని రాజోలు రాజకీయాలు ఒక్కసారిగా వాడీవేడిగా మారిపోయాయి. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు మధ్య ఒక్కసారిగా మాటల యుద్ధం మొదలైంది.…
నాడు ఓట్లు వేయించి గెలిపించిన పార్టీ కార్యకర్తలు నేడు ఈ ఎమ్మెల్యే మాకొద్దు బాబోయ్ అంటున్నారు. పార్టీ మారిపోయానని చెప్పి రెండేళ్లుగా ఎమ్మెల్యే దూరంగా ఉంటున్నారు. గెలిపించిన పార్టీ కార్యకర్తలు మాత్రం ఫ్లెక్సీల మీద ఫ్లెక్సీలు పెట్టి మరీ ఆ ఎమ్మెల్యేను వెంటాడుతునే ఉన్నారట. అవకాశం వచ్చినప్పుడల్లా ఎమ్మెల్యేకు నిద్ర లేకుండా చేస్తున్నారట. ఇదంతా అధికార పార్టీ నేతే వెనకుండి నడిపిస్తున్నారని తెలిసి.. సొంతపార్టీ వాళ్లే తలలు పట్టుకుంటున్నారట. రాపాకను ఇరకాట పెట్టే పనిలో జనసైనికులు? తూర్పుగోదావరి…
నాడు గెలిపించిన పార్టీలో ఆ ఎమ్మెల్యే నెంబర్ వన్. నేడు ఆయన కొనసాగుతున్న పార్టీలో ఆ ఎమ్మెల్యే నెంబర్ 152. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేకి విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. నియోజకవర్గంలో గెలిపించిన పార్టీ వాళ్లు వదిలేశారు. పంచన చేరిన పార్టీ వాళ్లు పట్టించుకోవడం మానేశారు. కో- ఆర్డినేటర్లను మార్పించేసిన ఆ ఎమ్మెల్యే… నియోజకవర్గం కేడర్‌ను గెలవలేకపోతున్నారట. వైసీపీ కేడర్ దగ్గర కాలేదా? తూర్పుగోదావరిజిల్లా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రాజకీయాల్లో ఓ డిఫెరెంట్ నేత. అసెంబ్లీలో జనసేన…