Hema : నటి హేమ సంచలన కామెంట్లు చేసింది. గతేడాది తనకు ఎవరినైనా చంపేయాలి అనిపించేదని చెప్పి సంచలనం రేపింది. వందలాది సినిమాల్లో నటించిన హేమ.. ఈ మధ్య ఎక్కువగా కాంట్రవర్సీల్లో ఇరుక్కుంటోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది. నేను కరోనా టైమ్ నుంచే కొంత డిప్రెషన్ లోకి వెళ్లిపోయా. అప్పుడు ఎక్కడికీ వెళ్లకపోవడంతో ఎంజాయ్ మెంట్ మిస్ అయ్యాను. ఒకే దగ్గర ఉండటం వల్ల డిప్రెషన్ గా అనిపించేది. ఇక గతేడాది…
చర్లపల్లి డ్రగ్ కేసులో పట్టుబడ్డ వోలేటి శ్రీనివాస్, విజయ్‌కి దేశవ్యాప్తంగా నెట్‌వర్క్ ఉందా?. అమెరికా కంపెనీ కోసం ఫార్మాస్యూటికల్ డ్రగ్స్ తయారు చేస్తున్నాడనే వాదనలో నిజమెంత?, ముంబై కోర్టులో పోలీసులు ఏం వాదించారు?. చర్లపల్లిలో మెఫిడ్రిన్ డ్రగ్స్ వ్యవహారం.. ఇప్పుడు ముంబైకి షిఫ్ట్ అయింది. ఈ కేసులో వాగ్దేవి ఫార్మా యజమాని వోలేటి శ్రీనివాస్‌తో పాటు వోలేటి విజయ్, మరో వ్యక్తి తానాజీని పోలీసులు ముంబైకి తరలించారు. వారిని కోర్టులో హాజరు పరిచారు. అంతే కాదు.. 15…
SHine Tom Chaco : దసరా సినిమాలో విలన్ గా నటించిన షైన్ టామ్ చాకో ఈ నడుమ తరచూ వార్తల్లో ఉంటున్నాడు. రీసెంట్ గా డ్రగ్స్ కేసులో ఇరుక్కుని అడ్డంగా దొరికిపోయాడు. అప్పటి నుంచి అతనికి మలయాళ ఇండస్ట్రీలో అవకాశాలు దొరకట్లేదు. తాజాగా ఆయన యాక్సిడెంట్ గురించి చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. నేను జీవితంలో ఎన్నో బాధలు అనుభవించి వచ్చాను. రోడ్డు ప్రమాదం మా కుటుంబాన్ని రోడ్డున పడేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు…
Drugs Case : తమిళ సినీ పరిశ్రమలో డ్రగ్స్ కేసు ఒక్కసారిగా కలకలం రేగింది. నటుడు శ్రీకాంత్ అలియాస్ శ్రీరామ్ ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఈ కేసులో ఇప్పుడు మరో నటుడు కృష్ణ కూడా అరెస్టు అయ్యాడు. కృష్ణ ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్నట్లుగా తెలుస్తోంది. నుంగంబాకం పోలీసులు కృష్ణను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుకున్నట్లుగా తెలుస్తోంది. కృష్ణతో అత్యంత సన్నిహితంగా ఉంటున్న తమిళ యువ దర్శకులు, మ్యూజిక్ డైరెక్టర్లూ డ్రగ్స్ ఏమైనా…
Stuart MacGill: మాదకద్రవ్యాల సంబంధించి ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ స్టువర్ట్ మెక్‌గిల్ (Stuart MacGill) దోషిగా తేలాడు. అతనిపై ఇదివరాలుడ్రగ్స్ కేసు నమోదు కాగా.. తాజాగా కోర్టు అతడిని దోషిగా తేల్చింది. ఈ కేసు కారణంగా మెక్‌గిల్ భవిష్యత్తు అంధకారంగా మారింది. మాదకద్రవ్యాల ముఖ్యంగా చెప్పుకొనే కొకైన్ సంబంధిత అక్రమ వ్యాపారంలో ఆయన తన బావమరిదితో కలిసి ఓ డ్రగ్ డీలర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కోర్టు నిర్ధారించింది. ఈ కేసు మొత్తం ఎనిమిది రోజుల పాటు విచారణ…
దొరికిన దొంగలు మళ్ళీ సమర్తించుకునే విధంగా ప్రభుత్వాన్ని బదనం చేస్తున్నారని, తాగి దొరికిన కేసులో బుకాయించి మాట్లాడితే తప్పు ఒప్పైతదనుకుంటే పొరపాటు అని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వానికి అనేక ప్రజాహిత పనులు కార్యక్రమాలు ఉన్నాయి..నిన్న ఒకవైపు కేబినెట్ సమావేశం అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయని, పోలీసులు విధి నిర్వహణలో స్థానికుల పిర్యాదు మేరకు రైడ్ చేస్తే దొరికిన రాజకీయ పెద్దల బందువులు అది ఒప్పు అన్నట్లుగా పోలీసులను విమర్శించే విధంగా…
విశాఖ డ్రగ్స్ రవాణా పంచాయతీ ఈసీకి చేరింది. విశాఖ డ్రగ్స్ రవాణాకు.. తమకు లింకులున్నాయన్న టీడీపీ ఆరోపణలపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. టీడీపీ దుష్ప్రచారం చేస్తోందంటూ వైసీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఆధారాల్లేని ఆరోపణలు ఎన్నికల కోడ్ ఉల్లంఘనేనని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. మరోవైపు.. చంద్రబాబు, పురంధేశ్వరి సన్నిహితులకే డ్రగ్స్ రవాణతో సంబంధం ఉందని వైసీపీ ఆరోపిస్తుంది. డ్రగ్స్ రవాణా విషయంలో చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ ఈసీకి కంప్లైంట్ చేసింది. సీబీఐ చెప్పిన…
వైజాగ్ డ్రగ్ కేసులో గుమ్మడి కాయ దొంగ అంటే బుజాలు తడుముకున్నట్టు ఉంది టీడీపీ పరిస్థితి అని వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్ కు ఆరోపణలు చేయడానికి బుద్ధి ఉండాలి కదా? అని దుయ్యబట్టారు. తమ పై విమర్శలు చేస్తున్నారు.. ఆ కంపెనీలు పురంధేశ్వరి దగ్గరి బంధువులది అని అంటున్నారని సజ్జల పేర్కొన్నారు. వైజాగ్ డ్రగ్ కేసులో టీడీపీ నేతల సంబంధం ఉన్నట్టు బలంగా అనిపిస్తుందని తెలిపారు. వైజాగ్ డ్రగ్ కేసులో…
డీఎంకే మాజీ కార్యకర్త జాఫర్ సాదిక్ ఇటీవల అరెస్టయిన అంతర్జాతీయ డ్రగ్ కార్టెల్తో తనకు సంబంధం ఉందన్న ఆరోపణలపై అన్నాడీఎంకేకు చెందిన ఎడప్పాడి కరుప్ప పళనిస్వామి (ఈపీఎస్), రాష్ట్ర బీజేపీ చీఫ్ కె.అన్నామలైపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గురువారం పరువు నష్టం దావా వేశారు.