ఆ ఎమ్మెల్యే తీరు చూసి జనం నోరెళ్లబెడుతున్నారు. మొదటి సారి రాజకీయాల్లోకి అడుగు పెట్టిన వెంటనే ఎమ్మెల్యేగా గెలవటమే కాదు….రికార్డు స్థాయిలో మెజారిటీ సాధించిన ఘనత ఆయనకే దక్కింది. ఎన్నికల ముందేమో అందర్నీ అన్నా అని ఆప్యాయంగా పలకరించినా, ఆ ఎమ్మెల్యే మాటల్లో ఇప్పుడు ఆ మర్యాద కనపడకపోవడంతో…. అప్పుడలా.. ఇప్పుడిలా అని నేతలు గుసగుసలాడుతున్నారట. కడపజిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం రాజకీయ పరంగా రాష్ట్రంలో గుర్తింపు కలిగిన నియోజకవర్గం. రూపాయికి బొమ్మా బొరుసు ఉన్నట్లు జమ్మలమడుగు రాజకీయాలలో…