తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పీఏ ప్రభాకర్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించడం స్థానికంగా కలకలం రేపుతోంది. అయితే.. నల్లగొండ పట్టణంలోని మంత్రి జగదీష్‌రెడ్డి పీఏ ప్రభాకర్ ఇంట్లో ఐటీ అధికారులు దాడులు చేశారు. అయితే.. గత 2 గంటల నుంచి ఐటీ అధికారులు ప్రభాకర్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే.. ఐటీ అధికారుల తనిఖీలు ప్రారంభమైన సమయంలో ప్రభాకర్ ఇంట్లో లేనట్లు సమాచారం. నల్లగొండ జిల్లాలో మరో మూడు రోజుల్లో మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుండగా.. ఈ పరిణామం స్థానికంగా హాట్‌టాపిక్‌గా మారింది. ఇదిలా ఉంటే.. ఈ ఐటీ రైడ్స్ జరగడానికి ముందే మంత్రి జగదీష్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించి జీవో నంబర్ 51పై మాట్లాడారు.
Also Read : శృంగారం వల్ల ఇన్ని లాభాలా..!
కేంద్ర ప్రభుత్వానికి సీబీఐ తోక సంస్థలాగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇతర పార్టీల నేతలను బెదిరించడం, లొంగదిసుకోడం కోసం ఇలాంటి సంస్థలను నిర్వీర్యం చేస్తుందని, ఇతర ప్రభుత్వాలను కూల్చడానికి సీబీఐ వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. దానిలో భాగంగానే సీబీఐ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు. ప్రభుత్వ జీవోలు ఎప్పుడు ఎలా విడుదల చేయాలో మాకు బాగా తెలుసనని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. అయితే.. మంత్రి జగదీష్‌రెడ్డి మీడియా సమావేశం ముగిసిన కాసేపటికే మంత్రి పీఏ ప్రభాకర్ ఇంటిపై ఐటీ దాడులు జరగడం గమనార్హం.