రోజు రోజుకు భారత రూపాయి పడిపోతుంది. దీంతో ఇప్పటికే అమెరికాన్ డాలర్ తో పోల్చితే ఇండియన్ రూపీ భారీగా పతనమైంది. అయితే.. అమెరికా డాలర్‌తో సమానంగా భారత్ రూపాయిని ఉపయోగించాలని తమ దేశం కోరుకుంటోందని శ్రీలంక ప్రెసిడెంట్ రణిల్ విక్రమసింఘే తెలిపారు. శ్రీలంక ఇండియన్ సీఈవో ఫోరమ్‌లో పాల్గొన్న ఆయన.. ఈ కామెంట్స్ చేశారు. జపాన్, కొరియా, చైనావంటి దేశాలతో సహా తూర్పు ఆసియాలో 75 సంవత్సరాల క్రితం అద్భుతమైన అభివృద్ధి జరిగినట్లయితే.. ఇప్పుడు హిందు మహా సముద్ర ప్రాంతంలో భారతదేశం వంతు వచ్చిందన్నారు.
Read Also: Vitality Blast: ధోని తరహాలో ఫినిష్.. మొదటిసారిగా ఫైనల్కి అడుగుపెట్టిన జట్టు..!
ఫోరమ్ అధ్యక్షుడు టీఎస్ ప్రకాశ్ సమావేశంలో శ్రీలంక ఆర్థిక వ్యవస్థలో భారత రూపాయి వినియోగాన్ని పెంచాలని ఆయన పేర్కొన్నాడు. ఈ సందర్భంగా శ్రీలంక ప్రెసిడెంట్ రణిల్ విక్రమసింఘే స్పందిస్తూ ఇండియన్ రూపీని వాడుతున్నట్లు తెలిపాడు. ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి పిలుపునిచ్చినందుకు ప్రతిస్పందనగా ఆయన ఈ కాంమెంట్స్ చేశాడు. ప్రపంచం అభివృద్ధి చెందుతోందని, భారతదేశం వేగంగా డెవలప్మెంట్ అవుతుందని శ్రీలంక ప్రెసిడెంట్ రణిల్ విక్రమసింఘే పేర్కొన్నారు.
Read Also: Kishan Reddy: రాహుల్ గాంధీ ట్వీట్పై కిషన్ రెడ్డి ఫైర్.. రాహుల్ వ్యాఖ్యలు సిగ్గుచేటన్న కేంద్రమంత్రి
త్వరలో భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వచ్చే వారంలో రణిల్ విక్రమసింఘే ఢిల్లీలో పర్యటించనున్నారు. ఇటీవల శ్రీలంక ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో కొట్టుమిట్టాడింది. ఏడాది కిందట అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన విక్రమ సింఘే తొలిసారిగా భారత్‌లో పర్యటించబోతున్నారు. ఆర్థిక సంక్షోభం నుంచి శ్రీలంకను బయటకు తీసుకు వచ్చేందుకు ఆ దేశ అధ్యక్షుడు అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు.