Health tips: చాలా మందికి ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తుంటాయి. కడుపు ఉబ్బరం అనేది చాలా సాధారణం. సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం, మన శరీరానికి సరిపడని వస్తువులు తీసుకోవడం వల్ల కూడా కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి.
టొమాటోతో కొంతమందికి హాని కలిగిస్తుంది. యాసిడ్ రిఫ్లక్స్ సమస్యను ఎదుర్కొంటున్న వ్యక్తులకు టమోటాలు హాని కలిగిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాంటి వారికి టొమాటో తినడం వలన కడుపు మంట వస్తుంది. అంతే కాకుండా.. టొమాటోలు తిన్న తర్వాత గుండెల్లో మంట, అజీర్ణం లేదా జీర్ణశయాంతర సమస్యలు ఉన్నవారు టమోటాలు తినకుండా ఉండటం మంచిది.