Israel: హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియేను జులైలో హత్య చేసింది తామేనని ఇజ్రాయెల్ తాజాగా ధ్రువీకరించింది. టెల్‌అవీవ్ రక్షణ మంత్రి కాట్జ్ ఈ విషయాన్ని తెలిపారు.
Iran Israel War: హిజ్బుల్లా లక్ష్యాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులను ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ హిజ్బుల్లా లక్ష్యాలను ఎంపిక చేసి నాశనం చేస్తోంది. హసన్ నస్రల్లాను చంపిన తర్వాత, ఇజ్రాయెల్ మీడియా ఇప్పుడు అతని వారసుడు హషీమ్ సఫీద్దీన్‌ను చంపినట్లు పేర్కొంది. అందిన సమాచారం ప్రకారం, బీరూట్‌లో హషీమ్ సఫీద్దీన్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. ముగ్గురు ఇజ్రాయెల్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు గురువారం అర్ధరాత్రి భీకరమైన వైమానిక దాడులను చేశాయని.,…
హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణం తర్వాత పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్- లెబనాన్- ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. గత కొద్ది రోజులుగా హిజ్బుల్లా లక్ష్యంగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది.