పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ను అందిస్తోంది. మంచి వడ్డీ రేటుతో గ్యారంటీ రిటర్న్స్ తో పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. రిస్క్ లేకుండా మంచి రాబడిని పొందాలని భావించే వారు పోస్టాఫీస్ పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అని సూచిస్తున్నారు నిపుణులు. జనవరి 1న ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాల్గవ, చివరి త్రైమాసికానికి ప్రభుత్వం వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదు. పోస్ట్ ఆఫీస్ తన కస్టమర్ల కోసం అనేక రకాల పొదుపు పథకాలను అమలు చేస్తోంది. వాటిలో మీ డబ్బు మెచ్యూరిటీ పిరియడ్ కి నేరుగా రెట్టింపు అయ్యే పథకం కూడా ఉంది. దీనిలో మీరు రూ. 2 లక్షలు డిపాజిట్ చేసి రూ. 2 లక్షల స్థిర వడ్డీని పొందవచ్చు.
Also Read:Story Board: రాజకీయ కుటుంబాల్లో గొడవలకు కారణమేంటి..? ఉత్తరాది, దక్షిణాది ఎక్కడైనా ఇదే తీరా..?
పోస్ట్ ఆఫీస్ కిసాన్ వికాస్ పత్ర (KVP) అనేది మీ డబ్బు నేరుగా రెట్టింపు అయ్యే పొదుపు పథకం. మీరు ఈ పథకంలో ఎంత డిపాజిట్ చేసినా, అది రెట్టింపు అవుతుంది. ఇప్పుడు మీరు దానిలో రూ. లక్ష లేదా రూ. 1 కోటి డిపాజిట్ చేసినా డబుల్ రిటర్న్స్ అందుకోవచ్చు. KVP పథకం కింద ఏకమొత్తంలో పెట్టుబడి పెట్టొచ్చు. ప్రస్తుతం ఈ పథకంలో 7.5 శాతం భారీ వడ్డీ లభిస్తోంది. దీని ప్రకారం, పోస్ట్ ఆఫీస్ ఈ పథకం 115 నెలల్లో అంటే 9 సంవత్సరాల 7 నెలల్లో మెచ్యూరిటీ చెందడమే కాకుండా మీ పెట్టుబడిని నేరుగా రెట్టింపు చేస్తుంది. మీరు కేవలం రూ. 1000 తో కూడా కిసాన్ వికాస్ పత్ర పథకంలో ఖాతాను ఓపెన్ చేయొచ్చు.
Also Read:Union Budget: కేంద్ర బడ్జెట్ తేదీపై సందిగ్ధం.. కొత్త అంచనాలు ఇవే!
మీరు పోస్ట్ ఆఫీస్ KVP పథకంలో రూ.2 లక్షలు డిపాజిట్ చేస్తే, మెచ్యూరిటీ తర్వాత మీకు రూ.4 లక్షలు, రూ.2 లక్షల స్థిర వడ్డీతో పాటు మొత్తం రూ.4 లక్షలు అందుతాయి. ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు. ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ పథకం హామీ ఇవ్వబడిన స్థిర రాబడిని అందిస్తుంది. ఈ పథకం కింద సింగిల్, జాయింట్ ఖాతాలు రెండూ తెరవవచ్చు. ఉమ్మడి ఖాతాకు గరిష్టంగా ముగ్గురు వ్యక్తులను యాడ్ చేసుకోవచ్చు.