కోతిని మనం దైవంగా భావిస్తాం. కానీ ఇప్పుడు ఆ కోతి మనకు చుక్కలు చూపిస్తోంది. పర్యావరణ సమతుల్యత దెబ్బతినడంతో అడవుల్లో ఉండాల్సిన కోతులు ఊళ్లలోకి చొరబడి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చాలా జిల్లాల్లో కోతుల బెడద ఎక్కువైపోయింది.