భారత సారథి రోహిత్ శర్మ విండీస్ సిరీస్ కు ముందు చాలా సన్నబడ్డాడు. బరువు పెరగడంతో ఫీల్డ్‌లో చురుగ్గా ఉండలేకపోయిన హిట్‌మ్యాన్.. ఒబేసిటి కారణంగా విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే.. అతన్ని అభిమానించే వాళ్లు సైతం పలు సందర్భాల్లో వడాపావ్ అంటూ పిలిచేవారు. ఓవర్ వెయిట్ కారణంగా రోహిత్ శర్మ ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే.. ఇటీవలికాలంలో పరుగులు చేసేందుకు కూడా చాలా ఇబ్బంది పడ్డాడు.. అసలే నిదానంగా, బద్దకంగా కనిపించే రోహిత్.. బరువు పెరగడంతో మరింత స్లో అయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అతని స్థాయి ఇన్నింగ్స్ ఆడి రోజులైంది.
Read Also: Hidimba: ఓంకార్ తమ్ముడి ‘హిడింబ’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
అయితే.. తాజాగా హిట్‌మ్యాన్ వెయిట్‌లాస్ కావడంతో అతను గత ఫామ్‌ను అందుకుంటాడనే నమ్మకం వస్తుంది. రోహిత్ బరువు తగ్గేందుకు చాలా కష్టపడ్డట్లు తెలుస్తుంది. కఠినమైన డైట్, వ్యాయామాలు చేస్తే తప్పిస్తే అంత ఔట్‌పుట్ రాదు. రోహిత్‌ను ఇప్పుడు చూసిన వారెవరైనా.. ఏంటీ మరీ ఇంత సన్నబడ్డాడని అతని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. తన బరువును తగ్గించుకుని రోహిత్ శర్మ ఫిట్‌గా కనిపిస్తున్నాడు. అతనిలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా బాగా పెరిగినట్లు కనబడుతుంది. గతంతో పోలిస్తే చాలా హుషారుగా హిట్ మ్యాన్ కనిపిస్తున్నాడు. ఇది చూసిన అతని అభిమానులు.. హిట్‌మ్యాన్ ఇదే మెయింటైన్ చేయాలని కోరుకుంటున్నారు.
Read Also: China: కనురెప్పల్లో గుడ్లు పెట్టిన పేను.. ఆశ్చర్యపోయిన వైద్యులు..
వెస్టిండీస్‌తో సిరీస్ ముందు టీమిండియా ఆటగాళ్లు కొత్త టెస్ట్ జెర్సీల్లో కనిపించారు. డ్రీమ్ ఎలెవెన్ టీమిండియా జెర్సీ స్పాన్సర్షిప్ దక్కించుకోవడంతో ఆ పేరు ముద్రించిన కొత్త కిట్లలో టీమిండియా ఆటగాళ్లు కనిపించారు. కొత్త జెర్సీలో తీసుకున్న సెల్ఫీని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు.. హిట్‌మ్యాన్ ఏంటీ.. గుర్తుపట్టలేనంతగా మారిపోయాడంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రోహిత్ వెయిట్ లాస్ అయినట్లు ఈ జెర్సీలో క్లీయర్ గా కనిపిస్తుంది. మరోవైపు కొత్త జెర్సీ డిజైన్‌పై పలువురు టీమిండియా అభిమానులు కొత్త జెర్సీ ఛండాలంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Captain interviews vice-captain 🎙️pic.twitter.com/xSEfXzqeVG
— CricTracker (@Cricketracker) July 11, 2023