India Captain Rohit Sharma on buzz around Virat Kohli Overseas Test Century: వెస్టిండీస్‌తో ఇటీవల జరిగిన రెండో టెస్టులో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. దాదాపుగా 5 ఏళ్ల తర్వాత విదేశీ గడ్డపై సెంచరీ బాదాడు. కోహ్లీ సెంచరీపై చాలా మంది ఫాన్స్, మాజీలు హర్షం వ్యక్తం చేయగా.. మరికొందరు మాత్రం విమర్శలు గుప్పించారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజీలాండ్ లాంటి పటిష్ట జట్లపై కాకుండా.. విండీస్ లాంటి జట్టుపై సెంచరీ చేశాడని వ్యాఖ్యానించారు. తాజాగా ఆ విమర్శలపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఘాటుగా స్పందించాడు. ఏ క్రికెటర్ ప్రదర్శన పైనా ఇలాంటి విమర్శలు చేయడం సరైంది కాదన్నాడు.
వెస్టిండీస్‌తో తొలి వన్డే మ్యాచ్ సందర్భంగా ప్రెస్ కాన్ఫెరెన్స్‌లో రోహిత్ శర్మ మాట్లాడుతూ… ‘ఇలాంటి విమర్శలపై ఇప్పటికే చాలాసార్లు స్పందించా. బయట నుంచి వచ్చే విమర్శలపై మేం ఎక్కువగా దృష్టి పెట్టం. జట్టులో ఏం జరుగుతుందనేది విమర్శలు చేసే వారికీ తెలియదు. అందుకే అలా మాటాడుతుంటారు. మా దృష్టంతా అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించడంపైనే ఉంటుంది. వ్యక్తిగతంగా రాణించినా.. మ్యాచ్‌లో ఎలా గెలవాలనేదే మాకు ముఖ్యం. జట్టుకు ఆట ఎలా ఉపయోగపడ్డాదనేది కీలకం. ఇప్పుడు మూడు వన్డేల సిరీస్‌ను గెలవడం పైనే దృష్టి పెట్టాం. యువ క్రికెటర్లకు ఎక్కువ అవకాశాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం’ అని అన్నాడు.
Also Read: IND vs WI Dream11 Prediction: భారత్-వెస్టిండీస్ డ్రీమ్11 టీమ్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్!
‘జట్టులో చాలా మంది ఆటగాళ్లకు ఎక్కువ క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. వారికి ప్రత్యేకంగా తమ పాత్ర, ఆట గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మ్యాచ్ పరిస్థితిని అర్థం చేసుకుని అందుకు తగ్గట్టుగా ఆడగలిగే సత్తా వారికి ఉంది. అయితే యువ క్రికెటర్లు స్వేచ్ఛగా ఆడగలిగేలా చూడటమే మా బాధ్యత. కొన్ని స్థానాల కోసం చాలా మంది ఆటగాళ్ల నుంచి తీవ్ర పోటీ నెలకొంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో చాలా ఆప్షన్లు ఉన్నాయి. ఈ సమయంలో తుది జట్టు ఎంపిక కెప్టెన్, కోచ్‌కు కష్టంగా ఉంటుంది’ అని రోహిత్ శర్మ చెప్పుకోచ్చాడు.
Also Read: Zaheer Khan-Virat Kohli: నా కెరీర్‌ను ముగించావ్ అని కోహ్లీతో అనలేదు: హీర్ ఖాన్