India Vs South Africa 1st Odi Match: నేటి నుంచి భారత్ వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ లో మూడు వన్డే మ్యాచ్ లు జరుగనున్నాయి. ఇవాళ జోహన్నెస్‌బర్గ్ వేదికగాఇమధ్యాహ్నం 1.30 గంటలకు తొలి వన్డే ఆరంభం కాబోతుంది. కేఎల్ రాహుల్ సారథ్యంలో గెలుపే లక్ష్యంగా భారత జట్టు బరిలోకి దిగుతుంది. ఈ మ్యాచ్ లో రింకూ సింగ్ వన్డేల్లోకి అరంగేట్రం చేయబోతున్నాడు. రింకూతో పాటు సంజూ శాంసన్ కూడా తది జట్టులో ఉండే ఛాన్స్ లు ఎక్కువగా ఉన్నాయని రాహుల్ తెలిపారు. ప్రస్తుతం టీమిండియాలో కెప్టెన్సీపై పోటీ తీవ్రంగా కొనసాగుతుంది. రోహిత్ శర్మ మరికొద్ది రోజుల్లో వన్డే సారథ్యం నుంచి తప్పుకునే ఛాన్స్ ఉండటంతో హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ మధ్య కెప్టెన్సీపై పోటీ నెలకొంది. ఈ క్రమంలో తాత్కాలిక కెప్టెన్ గా కేఎల్ రాహుల్ ఈ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేస్తే దీర్ఘకాలం వన్డే సారథ్య బాధ్యతలు లభించే ఛాన్స్ ఉంది.
Read Also: Dsp Nalini: సీఎం రేవంత్ రెడ్డి ఆఫర్ పై స్పందించిన నళిని.. సార్ అంటూ ఎమోషనల్ పోస్ట్
అయితే, దక్షిణాఫ్రికా- భారత్ జట్ల మధ్య టీ20 సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ వర్షంతో రద్దైంది.. తర్వాత రెండు మ్యాచ్ లలో ఇరు జట్లు తలో మ్యాచ్ ను గెలుచుకోవటంతో సిరీస్ డ్రాగా ముగిసింది. వన్డే సిరీస్ కు వరుణుడు నుంచి ప్రమాదం పొంచి ఉంది. తొలి వన్డే జరిగే జోహన్నెస్‌బర్గ్‌లో వర్షం పడే ఛాన్స్ ఉందని అక్కడి వెదర్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. ఈ మ్యాచ్ జోహన్నెస్‌బర్గ్‌లో ఉదయం 11 గంటలకు (భారత్ కాలమానం ప్రకారం 1.30గంటలకు) స్టార్ట్ అవుతుంది. రాత్రి 7గంటలకు (దక్షిణాఫ్రికా సమయం ప్రకారం) మ్యాచ్ ముగియనుంది. ఈ టైంలో వర్షం పడే ఛాన్స్ తక్కువగా ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మ్యాచ్ జరిగే టైంలో వర్షం పడే ఛాన్స్ కేవలం 2 నుంచి 5శాతం మాత్రమే ఉందని వెల్లడించింది. అదే జరిగితే వన్డే మ్యాచ్ కు వర్షం ముప్పు దాదాపు ఉండకపోవచ్చు..
Read Also: Reliance New Plan : మార్కెట్లో ప్రకంపనలు సృష్టించేందుకు అంబానీ మాస్టర్ ప్లాన్
ఇక, జోహన్నెస్‌బర్గ్ లోని ‘ది వాండరర్స్’ స్టేడియంలో నేడు ప్రోటీస్ జట్టుతో టీమిండియా తొలి పోరులో తలపడబోతుంది. ఈ స్టేడియంలో భారీ స్కోర్ చేసేందుకు అవకాశం ఉంది. గత నాలుగు వన్డేల్లో మూడు సార్లు 300 పరుగులకు పైగా స్కోర్లు నమోదు అయ్యాయి. మూడు సార్లు 400 పరుగుల మార్కు దాటింది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసే టీమ్ భారీ స్కోర్ పై దృష్టి పెట్టే ఛాన్స్ ఉంది. ఈ గ్రౌండ్ లో టీమిండియా వన్డే రికార్డు అంత బాగాలేదు.. భారత్ ఇక్కడ 8 మ్యాచ్ ల్లో.. ఐదింటిలో ఓటమిపాలైంది. అయితే, ఈ స్టేడియంలో దక్షిణాఫ్రికా 40 మ్యాచ్ లు ఆడగా 30 మ్యాచ్ లలో గెలిచింది. ఈ గణాంకాలను బట్టి చూస్తే ఇవాళ్టి వన్డేలో భారత్ జట్టు గెలవాలంటే మెరుగైన ప్రదర్శన చేయాల్సిన పరిస్థితి ఏర్పాడింది.