శంషాబాద్ ఎయిర్‌పోర్టు సరికొత్త రికార్డ్ సృష్టించింది. మే నెలలో అత్యధిక స్థాయిలో ప్రయాణికులు ప్రయాణం చేశారు. గత నెలలో ఏకంగా 2.3 మిలియన్ల మంది ప్రయాణం చేసి రికార్డ్ సృష్టించారు.
ఢిల్లీ మెట్రో (Delhi Metro) సరికొత్త రికార్డు సృష్టించింది. మెట్రో చరిత్రలోనే ఇదొక సరికొత్త అధ్యాయం. మంగళవారం మెట్రో స్టేషనలన్నీ జాతరను తలపించాయి. ఇసుకేస్తే రాలనంత జనం.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మరోసారి అత్యధిక వ్యూయర్ షిప్ నమోదైంది. మొన్న పాకిస్తాన్- ఇండియా మ్యాచ్ లో అత్యధికంగా 3.5 కోట్ల మంది వీక్షించగా, తాజాగా జరిగే న్యూజిలాండ్ మ్యాచ్ లో 4 కోట్లు వ్యూయర్ షిప్ దాటింది.
ఇండియా-పాక్ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ హాట్ స్టార్ లో అత్యధికంగా చూశారు. దాదాపు 3.5 కోట్లకు పైగా మంది చూశారు. ఇంతకుముందు కూడా భారత్-పాక్ మ్యాచ్ తలపడినప్పుడు 3 కోట్ల మంది చూశారు. తాజాగా ఆ రికార్డును ఇప్పుడు చెరిపేసింది. మూడు కోట్లకు పైగా మంది హాట్ స్టార్ మ్యాచ్ లైవ్ చూస్తుండటం.. ఇది డిజిటల్ ప్లాట్ ఫామ్ లో రికార్డుగా చెబుతున్నారు.
భారతదేశంలో అత్యధికంగా పన్ను చెల్లిస్తున్న వారిలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పేరు వినిపిస్తోంది. ఏంటీ అక్షయ్ కుమార్ అత్యధికంగా పన్ను చెల్లించడం ఏంటా అని సందేహం కలగవచ్చు. ఆదాయపు పన్ను శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. అక్షయ్ కుమార్ గత సంవత్సరం 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇండియాలో అత్యధిక పన్ను చెల్లింపుదారుగా ఉన్నారు.