విజయ్ వర్మ -తమన్నా భాటియా విడిపోయారనే వార్తలు సోషల్ మీడియాలో, మీడియాలో ముఖ్యాంశాలు అవుతున్న సంగతి తెలిసిందే. అయితే, వారిద్దరూ తమ విడిపోవడాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఇద్దరూ ఇప్పుడు ఒకే ప్రదేశంలో కనిపించారు. హోలీ సందర్భంగా ఇద్దరూ ఒకే చోట కనిపించడం హాట్ టాపిక్ అవుతోంది. అసలు విషయం ఏమిటంటే నటి రవీనా టాండన్ తన ఇంట్లో హోలీ పార్టీ ఏర్పాటు చేసింది. తమన్నా భాటియా మరియు విజయ్ వర్మ ఇద్దరూ రవీనా టాండన్ ఇంటికి వచ్చారు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది, ఈ ఇద్దరూ విడివిడిగా వచ్చారు. ఇక అక్కడి నుంచి వైరల్ అవుతున్న వీడియోలో, రవీనా ఇంటికి వెళ్ళే ముందు, విజయ్ వర్మ అక్కడ ఉన్న కెమెరామెన్‌తో హోలీ ఆడుతున్నట్లు మీరు చూడవచ్చు. అదే విధంగా, తమన్నా భాటియా కూడా మీడియాలో గట్టిగానే ఫోకస్ అయింది.
Pawan Kalyan : జనసేన జన్మస్థలం తెలంగాణ.. కర్మస్థానం ఏపీః పవన్ కల్యాణ్
వారిద్దరూ వేర్వేరు సమయాల్లో రవీనా టాండన్ ఇంట్లో ఏర్పాటు చేసిన హోలీ పార్టీకి చేరుకున్నారు. ఇద్దరూ కలిసి కనిపించలేదు కానీ విడివిడిగా కనిపించారు. అయితే, వారు రవీనా టాండన్ ఇంట్లో కలిశారా లేదా, ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారా లేదా, లేదా వారు హోలీ ఆడారా లేదా అనే దాని గురించి ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు. రవీనా టాండన్ ఇంట్లో వారిద్దరూ ఉన్న వీడియో వైరల్ అయిన క్రమంలో సోషల్ మీడియాలో ప్రజలు రకరకాల ఊహాగానాలు చేయడం ప్రారంభించారు. రవీనా టాండన్ వారి ప్యాచప్ చేయాలని కోరుకుంటున్నట్లు ఒకరు కామెంట్ చేస్తే మరొక యూజర్ వారిద్దరూ విడిపోయారని రాశారు. అందుకే ఇద్దరూ కలిసి కనిపించలేదని రాసుకొచ్చారు.వారిద్దరూ రవీనా టాండన్ ఇంటికి విడివిడిగా చేరుకున్న తీరును బట్టి, వారి విడిపోయారనే పుకారు ప్రజలకు నిజమే అనిపిస్తుంది. కానీ వారు ఇంకా అధికారికంగా విడిపోతున్నట్లు ప్రకటించలేదు.