Pawan Kalyan : పిఠాపురంలో జనసేన 12వ ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన జన్మస్థలం తెలంగాణ అయితే.. కర్మస్థానం ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకొచ్చారు. తెలంగాణతో తనకు విడదీయరాని అనుబంధం ఉందన్నారు. తెలంగాణలో తనకు కరెంట్ షాక్ వచ్చి చనిపోయేవాడినని.. కొండగట్టు ఆంజనేయ స్వామి దయ, తెలంగాణ ప్రజల ఆశీస్సులతోనే బయటపడ్డానని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా గద్దర్ ను కూడా గుర్తు చేసుకున్నారు. బండెనక బండి కట్టి అంటూ ఆయన పాట పాడారు.
Read Also : Lemon Water: పరగడుపున నిమ్మ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా?
గద్దర్ తనను కలిసినప్పుడల్లా ఏరా తమ్ముడు అంటూ పలకరించేవాడని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ నుంచి వచ్చిన జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ పవన్ కల్యాణ్ పాడటం అందరినీ ఆకట్టుకుంది. తనకు భయం లేదు కాబట్టే అంత నిర్విరామంగా పోరాడానని తెలిపారు. దాదాపు పదేళ్లుగా ఎన్నో అవమానాలు పడ్డానని.. అవే ఈ స్థాయికి తీసుకొచ్చినట్టు గుర్తు చేసుకున్నారు. దేశమంతా మనవైపు చూసేలా వందశాతం స్ట్రైక్‌రేట్‌తో విజయం సాధించామని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.
దాశరథి సాహిత్యం చదివి తాను ప్రభావితం అయినట్టు స్పష్టం చేశారు. గత ఐదేళ్ల అరాచక పాలనను కిందకు దించేసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించామన్నారు. గత ఐదేళ్లలో ప్రతిపక్షాలను దారుణంగా వేధించారని.. చంద్రబాబు నాయుడు వయసుకు కూడా గౌరవం ఇవ్వలేదంటూ చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా ఎన్నో అవమానాలు చేస్తే.. చివరకు ప్రజలు తరిమికొట్టినట్టు తెలిపారు.