Pawan Kalyan : పిఠాపురంలో జనసేన ఆవిర్భావ 12వ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మరీ ముఖ్యంగా హిందీ భాష, సనాతన ధర్మం, ఉత్తర భారత్, దక్షిణ భారత్ గా విడగొట్టడంపై మాట్లాడారు. భారత్ దేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉత్తర భారత్, దక్షిణ భారత్ గా విడగొట్టొద్దు అంటూ తేల్చి చెప్పారు. మనమంతా ఇండియన్లుగా గర్వించాలన్నారు. ఎప్పటికీ ఉత్తర భారత్, దక్షిణ భారత్ గా విడిపోతాం అని ఎవరికి వారు మాట్లాడితే ఎలా.. అంతా మీ ఇష్టమా అంటూ ప్రశ్నించారు. తెలంగాణ, ఏపీ విభజన సమయంలో కూడా ఇలాంటి మాటలు చాలా వినిపించాయని గుర్తు చేశారు.
Read Also : Tamannah – Vijay : బ్రేకప్ అనంతరం ఒకే చోట కనిపించిన తమన్నా, విజయ్
హిందీ భాషను వద్దని కొందరు చెప్పడం కరెక్ట్ కాదన్నారు. ఎందుకంటే అఖండ భారత దేశంలో హిందీ మాట్లాడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని.. అది అవసరం అన్నారు. మన సినిమాలను ఉత్తర ప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో విడుదల చేస్తూ అక్కడి డబ్బులు తీసుకుంటున్నప్పుడు.. హిందీ వద్దంటే కుదరదు అంటూ తేల్చి చెప్పారు. మన అభివృద్ధిలో హిందీ కూడా భాగమే అంటూ తెలిపారు.
ఇక సనాతన ధర్మం, సెక్యులరిజం గురించి కూడా మాట్లాడారు. ‘నేను ఇప్పుడేదో కొత్తగా సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నానని అనుకుంటున్నారు. కానీ నేను మొదటి నుంచి రామభక్తుడినే. గతంలో రాముడి తల నరికినప్పుడు కూడా నేను మాట్లాడాను. అమ్మవారిని అవమానించినప్పుడు కూడా బయటకు వచ్చి ప్రశ్నించాను. హిందూ దేవుళ్లను తిడుతుంటే కోపం రావొద్దంటే ఎలా. పాతబస్తీలో ఒక వ్యక్తి పోలీసులు 15 నిముషాలు టైమ్ ఇస్తే హిందువులను చంపేస్తాం అంటే కోపం రాదా’ అంటూ ప్రశ్నించారు. తిట్టినా సరే కోపం రావొద్దంటే ఎలా.. ఇదే ఇతర మతాలను తిడితే ఊరుకుంటారా అంటూ అడిగారు. సనాతన ధర్మం జోలికి రావొద్దంటూ హెచ్చరించారు.