India won Test series with 1-0 vs West Indies: వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలనుకున్న భారత్ ఆశలపై వరణుడు నీళ్లు చల్లాడు. రెండో టెస్టులో చివరి రోజైన సోమవారం పూర్తిగా ఆటను వర్షం తుడిచిపెట్టేయడంతో.. భారత్ డ్రాతో సరిపెట్టుకోక తప్పలేదు. దాంతో సిరీస్ 1-0తో టీమిండియా సొంతమైంది. భారీ వర్షంతో మ్యాచ్ చివరి రోజు ఒక్క బంతి కూడా సాధ్యం కాలేదు. మ్యాచ్ డ్రా కావడంతో సిరీస్ సొంతమైనా.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో భారత్ కీలక పాయింట్లు కోల్పోయింది.
నాలుగో రోజు వర్షం అంతరాయంతో దాదాపు ఒక సెషన్ ఆట తుడిచిపెట్టుకుపోయిన విషయం తెలిసిందే. చివరి రోజు అయినా వరుణుడు కరుణిస్తాడనుకుంటే.. అది జరగలేదు. వర్షం వస్తూ పోతూ ఉండటంతో.. ఆటగాళ్లు అసలు మైదానంలోకి కూడా రాలేకపోయారు. భారీ వర్షం కారంగా మ్యాచ్ సాధ్యపడకపోవడంతో.. చివరికి అంపైర్లు ఆటను రద్దు చేశారు. దాంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. నాలుగోరోజు 365 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ ఆట ముగిసే సమయానికి 76/2తో నిలిచింది. విండీస్ విజయానికి ఇంకా 289 పరుగులు కావాల్సి ఉంది. త్యాగ్‌నారాయణ్ (24 నాటౌట్), జెర్మైన్ బ్లాక్‌వుడ్ (20 నాటౌట్) క్రీజులో ఉన్నారు.
ఈ సిరీస్‌లో భారత బౌలర్లు అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. ఆ జోరు చూస్తే సోమవారం కనీసం రెండు సెషన్ల ఆట సాధ్యపడినా.. విండీస్‌ను ఆలౌట్ చేసేవారు. కానీ వరణుడు భారత్ విజయాన్ని అడ్డుకున్నాడు. రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 438 పరుగులు చేయగా.. విండీస్ 255 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించిన భారత్.. 181/2 వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో విండీస్ 76/2తో నిలిచింది. తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌లోని తొలి మ్యాచ్ జూన్ 27న జరుగుతుంది.
Also Read: Cyber Fraud: చైనాలో కూర్చొని కూర్చుని స్కెచ్ వేస్తే.. 15000 మంది 712కోట్లు మోసపోయారు
https://twitter.com/12th_khiladi/status/1683554428601892865?s=20