Immoral Relationship : మొబైల్ పోర్న్ లో వీడియో చూస్తుందన్న అనుమానంతో భార్యను భర్త గొంతునులిమి చంపేశాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని హల్దానీలో చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడైన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హల్దానీకి చెందిన యూనస్, సీమ ఇద్దరికీ రెండో పెళ్లి. పెళ్లి తర్వాత దంపతులిద్దరూ ఛానల్ గేట్ ఇందిరానగర్ ప్రాంతంలో అద్దెకు ఉంటున్నారు. మొదట్లో ఈ ఇద్దరి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతోంది. కానీ కాలక్రమేణా, యూనస్ తన మొదటి భార్యతో సన్నిహితంగా ఉండసాగాడు. దీంతో వారి సంబంధంలో పొరపచ్చాలు వచ్చాయి. దీంతో యూనస్, సీమలకు రోజూ గొడవలు జరిగేవి. ఇంతలో సీమకు జకీర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. జకీర్ తన సోదరుడని ఆమె యూనస్‌కు చెప్పింది. అయితే సీమ రోజూ మొబైల్‌తో బిజీగా ఉండడం చూసి యూనస్‌కి ఆమెపై అనుమానం వచ్చింది.
Read Also: Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం.. 4.2 తీవ్రతతో కంపించిన భూమి..
దీంతో అనుమానం రావడంతో ఓ రోజు సీమ మొబైల్‌ను చెక్ చేయగా, అందులో జకీర్ పోర్న్ వీడియో పంపినట్లు యూనస్ చూశాడు. దీంతో కోపోద్రిక్తుడైన యూనస్ సీమ గొంతు నులిమి హత్య చేశాడు. దీంతో యూనస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు, మహిళ ఇద్దరికీ ఇది రెండో పెళ్లి. తన భార్య తరచూ మొబైల్ ఫోన్‌తో బిజీగా ఉండడంతో మొబైల్‌ను తనిఖీ చేయగా మూడో వ్యక్తి మొబైల్‌లో పోర్న్ వీడియోలు పంపినట్లు గుర్తించాడు. వీడియో పంపిన వ్యక్తి సీమ ప్రియుడని తేలడంతో కోపోద్రిక్తుడైన యూనస్ హత్య చేశాడు. నిందితుడు యూనస్‌ను పోలీసులు అరెస్ట్ చేసి అతనిపై హత్య కేసు నమోదు చేశారు. తన భార్యను తానే హత్య చేసినట్లు పోలీసుల వాంగ్మూలంలో అతనే అంగీకరించాడు. యూనస్ బియ్యం వ్యాపారం చేసేవాడు. యూనస్, సీమ ఇద్దరూ ప్రేమించుకునే పెళ్లి చేసుకున్నారు.