దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. అగ్నిగుండలా భానుడు భగభగమండిపోతున్నాడు. దీంతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. బయటకు రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. ఇక మే 31న పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ హీట్‌వేవ్ హెచ్చరికలు జారీ చేసింది.
ఇది కూడా చదవండి: Pragyananda Defeat Carlsen: సంచలనం.. కార్ల్‌సెన్ పై ప్రజ్ఞానంద తొలి విజయం..
శుక్రవారం అనేక రాష్ట్రాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. బుధవారం ఢిల్లీలో 52 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మే 31న బీహార్‌లో తీవ్రమైన హీట్‌వేవ్ పరిస్థితులు ఉంటాయని.. అలాగే వేడిగాలులు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ రాజస్థాన్, మధ్యప్రదేశ్, విదర్భ, జార్ఖండ్, ఒడిశాలో హీట్‌వేవ్ పరిస్థితులు ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది.
ఇది కూడా చదవండి: Bujji and Bhairava Animated: బుజ్జి, భైరవ చేసిన అడ్వెంచర్ మాములుగా లేదుగా.. ట్రైలర్ చూశారా..
వేడి తీవ్రత ఎక్కువగా ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించింది. తేలికైన, వదులు దుస్తులు ధరించాలని తెలిపింది. అలాగే వైద్య సేవలను కూడా అందుబాటులో ఉంచుకోవాలని పేర్కొంది. హీట్‌వేవ్ కారణంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని స్పష్టం చేసింది. ముఖ్యంగా వృద్ధులు, పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.
ఇది కూడా చదవండి: Andhra Pradesh : ఏపీ సీఈవో జారీ చేసిన మెమోను వెనక్కి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం