కల్కి 2898 AD టీమ్ తన సినిమా ప్రమోషన్లను కాస్త కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ రావాలంటే మాత్రం పెద్ద ఎత్తున ప్రమోషన్లు కచ్చితంగా అవసరం. ఈ నేపథ్యంలోనే రెండు రోజుల క్రితం బుజ్జిని పరిచయం చేసింది ఛుత్ర బృందం. ఇక తాజాగా బుజ్జి, భైరవ కలిసి చేసిన అడ్వెంచర్లను ఓ యానిమేటెడ్ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది సినిమా బృందం. ఈ సినిమాలో హీరో ప్రభాస్ ‘భైరవ’ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇక సినిమాలో హీరో వాడిన వెహికిల్ పేరు ‘బుజ్జి.’ ఆరు టన్నుల బరువున్న కారును ప్రత్యేకంగా సినిమా కోసమే తయారు చేయించి ఈ మధ్యే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
Tenth Pass: పట్టువదలని విక్రమార్కుడు.. 10వ ప్రయత్నంలో టెన్త్ పాస్.. బ్యాండ్ మేళంతో ఊరేగింపు..
ఇకపోతే తాజాగా ఇప్పుడు బుజ్జి, భైరవ కలిసి చేసిన సాహసాలకు సంబంధించి ఓ యానిమేటెడ్ సిరీస్ ను రూపొందించారు చిత్ర బృందం. ఇక వీటికి సంబంధించిన ట్రైలర్ ను గురువారం రిలీజ్ చేయగా.. ఈ సిరీస్ మే 31 శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నాగ్ అశ్విన్ ఈ మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ మూవీని డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక యానిమేటెడ్ సిరీస్ ను కూడా ప్రభాస్, బుజ్జి, బ్రహ్మానందం పాత్రలో ఇప్పుడతడే రూపొందించాడు. ఈ యానిమేటెడ్ సిరీస్ ‘ప్రైమ్ వీడియో’ లోకి రాబోతోంది.
IRDAI: ఇకపై గంటలోపు నగదు రహిత క్లెయిమ్.. మూడు గంటలలోపు క్లెయిమ్ సెటిల్‌మెంట్..
ఈ యానిమేటెడ్ సిరీస్ ను “బీ అండ్ బీ” బుజ్జి అండ్ భైరవ అనే టైటిల్ తో తీర్చిదిద్దారు. ఈ సినిమాలోని భైరవ పాత్రకు ప్రభాస్ డబ్బింగ్ చెప్పగా.. బుజ్జి పాత్రకి మాత్రం కీర్తి సురేశ్ తన వాయిస్ ను అందించింది. అలాగే వీరిమధ్యలో బ్రహ్మానందం పాత్రను కూడా ఇంట్రడ్యూస్ చేసారు. ఈ యానిమేటెడ్ సిరీస్ లో బుజ్జి, భైరవ డైలాగ్స్ కాస్త నవ్వు తెప్పించేలా కనిపెడుతున్నాయి. ఇక ఈ యానిమేటెడ్ సిరీస్ ను శుక్రవారం నాడు తెలుగుతోపాటు ఇంగ్లిష్, హిందీ, స్పానిష్ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఏకంగా రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో వైజయంతీ మూవీస్ ఈ సినిమాను తెరకెక్కిస్తుంది. ఇక ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ లాంటి ప్రముఖ నటులు నటించారు. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ కాబోతోంది.