వికారాబాద్ జిల్లా పరిగి సీఐ కార్యాలయంలో ఐజీ సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. నిన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పరిగిలో ప్రెస్ మీట్ నిర్వహించడంపై ఐజీ స్పందించి ఫైరయ్యారు. పట్నం నరేందర్ రెడ్డి కండిషన్ బెయిల్ పై ఉండి విచారణను ప్రభావితం చేసే విధంగా ప్రెస్ మీట్ పెట్టడం సరి కాదని తెలిపారు. బెయిల్ రద్దుకు సిఫారసు చేస్తామని ఐజీ సత్యనారాయణ హెచ్చరించారు.
లగచర్లలో అధికారులపై దాడి కేసులో నిందితులందరికీ నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం బెయిల్‌ను మంజూరు చేసింది. పట్నం నరేందర్ రెడ్డితో పాటు సురేష్, మిగతా నిందితులు అందరికీ బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
Patnam Narender Reddy: కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని కొడంగల్ కోర్టు పోలీసు కస్టడీకి అనుమతించింది. లగచర్ల దాడి కేసులో ఏ-1గా ఉన్న నరేందర్‌రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కొడంగల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
TG High Court: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కు తెలంగాణ హైకోర్టు లో చుక్కెదురైంది. పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్‌ను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు ఇవాళ తీర్పు ఇచ్చింది.
ప్రధాని మోడీ భద్రతా వలయంలో మహిళా కమాండో.. నెట్టింట ఫోటోలు వైరల్ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భద్రతా వలయంలో మహిళా కమాండోలు ఉన్నారానే విషయం తాజాగా బయటకు వచ్చింది. ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో తెగ చర్చ కొనసాగుతుంది. అయితే, బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ షేర్ చేసిన ఓ ఫొటోలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. పార్లమెంట్ దగ్గర ప్రధాని నడుస్తుండగా ఆయన వెనక ఓ మహిళా భద్రతా సిబ్బంది కనపడ్డారు.…
BRS KTR: పెద్ద పెద్ద నియంతలు కూడా కొట్టుకుపోయారని బీఆర్ఎస్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. చర్లపల్లి జైల్లో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు కలిసి పరామర్శించారు.
వికారాబాద్ జిల్లా లగచర్లలో ఫార్మా కంపెనీ స్థాపనపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ , ఇతర రెవెన్యూ అధికారులపై స్థానికుల దాడి జరిగింది. ఈ దాడిలో అధికారులు ప్రయాణిస్తున్న వాహనాలను రాళ్లతో ధ్వంసం చేశారు.
Patnam Narender Reddy Reacts on Remand report in Lagcherla Incident: లగచర్లలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పై దాడి కేసులో అరెస్ట్ చర్లపల్లి జైలులో రిమాండ్ లో ఉన్న కొడంగల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి జైలు నుంచి అఫిడవిట్ ఇచ్చారు. పోలీసులు నా పేరుతో నిన్న బయటకు వచ్చిన కన్ఫెషన్ రిపోర్టు తప్పు అని తెలిపారు.