Honda Unicorn 2025: హోండా మోటార్ సైకిల్స్ తన 2025 యూనికార్న్ మోడల్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ కొత్త వెర్షన్ బెస్ట్-సెల్లింగ్ కమ్యూటర్ మోటార్ సైకిల్ శ్రేణికి మరిన్ని ఆకర్షణీయమైన అప్‌గ్రేడ్లతో వచ్చింది. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ. 1,19,481 గా కంపెనీ నిర్ణయించబడింది. ఇక 2025 యూనికార్న్ లో 162.71cc సింగిల్-సిలిండర్, ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది OBD2B ప్రమాణాలను అనుసరిస్తుంది. 13 బీహెచ్‌పీ శక్తిని, 14.58Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఇందులో 5-స్పీడ్ గేర్‌బాక్స్ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ వినియోగదారులకు మెరుగైన మైలేజ్‌తో పాటు సరైన పనితీరును అందిస్తుంది.
Also Read: Eating Food On Bed: మంచంపై కూర్చొని ఆహారం తీసుకుంటున్నారా? మీ ఆరోగ్యంపై ఈ దుష్ప్రభావాలు ఖాయం
2025 హోండా యూనికార్న్ పలు ఆధునిక ఫీచర్లతో విడుదలైంది. ఇవి దీన్ని మరింత ప్రత్యేకంగా నిలిపేలా ఉన్నాయి. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ లో భాగంగా.. ఇది గేర్ పొజిషన్ ఇండికేటర్, సర్వీస్ డ్యూ రిమైండర్, ఈకో ఇండికేటర్ వంటి సమాచారాన్ని చూపిస్తుంది. కొత్త ఎల్ఈడి హెడ్‌ల్యాంప్ క్రోమ్ టచ్‌తో అందంగా ఉండడమే కాకుండా, రాత్రి వేళల్లో మెరుగైన వెలుతురు అందిస్తుంది. టూర్‌లు లేదా సుదీర్ఘ ప్రయాణాల కోసం మొబైల్ పరికరాలను ఛార్జ్ చేయడానికి యూఎస్‌బీ టైప్-C ఛార్జింగ్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది.
Also Read: IND vs AUS: ముగిసిన నాల్గవ టెస్టు మొదటిరోజు ఆట.. ఆధిపత్యం చెలాయించిన ఆస్ట్రేలియా?
2025 హోండా యూనికార్న్ పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, మ్యాట్ ఆక్సిస్ గ్రే మెటాలిక్, రేడియంట్ రెడ్ మెటాలిక్ అనే మూడు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది. ఇక ఈ మోడల్ ధర రూ. 1,19,481 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా ఉంది. ఇది పాత మోడల్ కంటే దాదాపు రూ. 8,180 ఎక్కువగా ఉంది. 2025 హోండా యూనికార్న్ ప్రత్యేకతలు చూస్తే.. మెరుగైన శక్తి కలిగిన ఇంజిన్, ప్రీమియం డిజైన్, ఆధునిక ఫీచర్లు, ఉత్తమమైన మైలేజ్ ను అందించనుంది. మొత్తానికి, 2025 హోండా యూనికార్న్ భారతీయ కమ్యూటర్ సెగ్మెంట్‌లో విశేష ఆదరణ పొందే అవకాశం ఉంది. ఈ మోడల్ రోజువారీ ప్రయాణాలను సౌకర్యవంతంగా, భద్రతతో కూడిన అనుభూతిని అందిస్తుంది.